చెక్కుల పంపిణీ | - | Sakshi
Sakshi News home page

చెక్కుల పంపిణీ

Feb 5 2026 7:24 AM | Updated on Feb 5 2026 7:24 AM

చెక్క

చెక్కుల పంపిణీ

చెక్కుల పంపిణీ ఓటర్లతో కేవీఆర్‌ సెల్ఫీ ఎన్నికల నిబంధనలపై అవగాహన కొనసాగుతున్న పీజీ ఇంటిగ్రేటెడ్‌ పరీక్షలు పాలీసెట్‌కు దరఖాస్తు చేసుకోవాలి ఎదురెదురుగా బైక్‌ల ఢీ

నిజాంసాగర్‌(జుక్కల్‌): జుక్కల్‌ మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌తో పాటు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం సహాయనిధి పథకాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్‌ నాయకులు రమేష్‌ దేశాయ్‌ తదితరులు ఉన్నారు.

కామారెడ్డి టౌన్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా నియోజకవర్గ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేపట్టారు. బుధవారం 10వ వార్డులో బీజేపీ అభ్యర్థి కాసర్ల మాధవి తరపున ప్రచారం చేసి మల్లన్న గుడి దగ్గర ఓటర్ల కోరిక మేరకు సెల్ఫీ దిగారు. ఈ దృశ్యాన్ని ‘సాక్షి’ కెమెరా క్లిక్‌ అనిపించింది.

బిచ్కుంద(జుక్కల్‌): మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఖర్చుల వివరాలు, ఎంత వరకు ఖర్చు చేయాలి తదితర ఎన్నికల నిబంధనలపై గురువారం అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని కమిషనర్‌ ఖయ్యుం తెలిపారు. పోటీ చేస్తున్న అభ్యర్థులు అందరు అవగాహన సదస్సుకు హాజరు కావాలని కోరారు.

తెయూ (డిచ్‌పల్లి): తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో పీజీ ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ కోర్స్‌ ఏపీఈ, ఐపీసీహెచ్‌, ఐఎంబీఏ 3, 5వ సెమిస్టర్‌, ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎమ్‌ 1, 3వ సెమిస్టర్‌ రెగ్యులర్‌ థియరీ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగినట్లు అకడమిక్‌ ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ ఘంటా చంద్రశేఖర్‌ తెలిపారు. మధ్యాహ్నం ఆర్ట్స్‌అండ్‌సైన్స్‌ కాలేజ్‌, న్యాయ కళాశాలలో జరిగిన పరీక్షలకు మొత్తం 201 మంది విద్యార్థులకు 195 మంది హాజరుకాగా ఆరుగురు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.

నందిపేట్‌(ఆర్మూర్‌): ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో డిప్లొమా కోర్సుల ప్రవేశానికి నిర్వహించే పాలీసెట్‌–2026 పరీక్షకు ఏప్రిల్‌ 20 తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని నందిపేట పాలిటెక్నిక్‌ పిన్సిపాల్‌ రాజ్‌కుమార్‌ తెలిపారు. మే 13 న పాలీసెట్‌ పరీక్ష ఉంటుందన్నారు. పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. నందిపేట కళాశాలలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌, ఈసీఈ, కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులలో 60 సీట్ల చొప్పున ఉన్నాయని తెలిపారు.

నందిపేట్‌(ఆర్మూర్‌): ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన నందిపేట మండలం చౌడమ్మ కొండూర్‌ గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఎస్సై శ్యాంరాజ్‌ తెలిపిన వివరాలిలా ఉన్నా యి. చౌడమ్మ కొండూర్‌ గ్రామానికి చెందిన కొడపాల్‌ సాగర్‌ (30) మంగళవారం రాత్రి 10 గంటలకు బైక్‌పై నందిపేట నుంచి స్వగ్రామానికి వెళ్తున్నాడు. మార్గమధ్యంలో ఎదురుగా వస్తున్న బైక్‌ ఢీకొట్టింది. బైక్‌లపై ప్రయాణిస్తున్న కొడుపుల సాగర్‌తోపాటు శివకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 అంబులెన్సులో చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సాగర్‌ మృతి చెందగా, తీవ్ర గాయాలపాలైన శివ పరిస్థితి విషమంగా ఉంది. మృతుడి తండ్రి సాయన్న ఫిర్యాదు మేరకు అతివేగంగా అజాగ్రత్తగా బైక్‌ నడిపిన వెలుమల ప్రవీణ్‌పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

చెక్కుల పంపిణీ 
1
1/1

చెక్కుల పంపిణీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement