‘బంగారం’లాంటి ఓటు! | - | Sakshi
Sakshi News home page

‘బంగారం’లాంటి ఓటు!

Feb 6 2026 7:11 AM | Updated on Feb 6 2026 7:11 AM

‘బంగారం’లాంటి ఓటు!

‘బంగారం’లాంటి ఓటు!

‘బంగారం’లాంటి ఓటు!

నామినేషన్ల ఘట్టం ముగియడంతో అభ్యర్థులు ప్రచార రంగంలోకి దూకారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుస్తున్నారు. కామారెడ్డి పట్టణంలో ఓ అభ్యర్థి భర్త తనకు తెలిసిన ఇంటికి వెళ్లాడు. ‘మీకు ఏ ఆపద వచ్చినా నిమిషాలల్ల ఉరికొచ్చిన. ప్రతీ కష్టంల మేమున్నం. మున్సిపల్‌ ఎలక్షన్ల నా భార్య నిలబడ్డది. మీరు మాకే ఓటెయ్యాలె పెద్దవ్వ’ అంటూ అడిగాడు. ‘అయ్యో బిడ్డా.. మీకు గాకుంటె యెవళ్లకు వేస్తం’ అన్నది ఆ పెద్దవ్వ.. ‘మొన్న గాయిన ఇంటికి వచ్చి మీ ఇంట్ల పది ఓట్లున్నయి. మాటిస్తే అద్దతులం బంగారం పెడతా అన్నడు. మాకేమో మీకే వేయాలని ఉంది. అందుకే ఏదో ఒకటి జెప్పి పంపినం’ అని చెప్పింది. దీంతో ఆ అభ్యర్థి భర్త పది ఓట్లు తమకే అనుకుంటూ లోలోపల సంతోషపడ్డడు. అయితే అంతలోనే ఆ పెద్దవ్వ బాంబు పేల్చింది. ‘బిడ్డా మీకే ఓట్లేస్తంగని ఆ అద్దతులం ఏందో నువ్వే ఇయ్యు’ అనడంతో షాక్‌ అయ్యాడు. ఇప్పటికే బంగారం ధర ఆకాశానికంటింది. అద్దతులం అంటే ఎనభై తొంభై వేలు.. వామ్మో అనుకుని ‘సరే పెద్దవ్వ. మళ్ల వచ్చి కలుస్త’ అని చెప్పి మరో ఇంటికి వెళ్లిపోయాడు.

– సాక్షి ప్రతినిధి, కామారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement