జింక కళేబరం లభ్యం | - | Sakshi
Sakshi News home page

జింక కళేబరం లభ్యం

Feb 6 2026 7:11 AM | Updated on Feb 6 2026 7:11 AM

జింక కళేబరం లభ్యం

జింక కళేబరం లభ్యం

జింక కళేబరం లభ్యం

చిరుత దాడి చేసి ఉంటుందని

అనుమానం

ట్రాక్‌ కెమెరా ఏర్పాటు చేసిన

అటవీ అధికారులు

మాచారెడ్డి: లక్ష్మీరావులపల్లి అటవీ ప్రాంతంలో జింక మృతదేహం కనిపించింది. చిరుత దాడి చేసి చంపి ఉంటుందని అనుమానిస్తున్నారు. బుధవారం లక్ష్మీరావులపల్లి గ్రామానికి చెందిన ఉపాధిహామీ పథకం కూలీలు అటవీ ప్రాంతంలో పనిచేస్తుండగా సమీపంలో వారికి జింక కళేబరం కనిపించింది. దీంతో వారు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఎఫ్‌ఆర్‌వో రమేశ్‌ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని కళేబరాన్ని పరిశీలించారు. ఘటనా స్థలంలో ట్రాక్‌ కెమెరాలను అమర్చారు. ఒకవేళ చిరుత దాడిచేసి ఉంటే మళ్లీ అదే ప్రాంతానికి వస్తుందని ఎఫ్‌ఆర్‌వో తెలిపారు. ఉపాధి కూలీలతో పాటు ఎవరూ మూడు రోజుల వరకు ఆ ప్రాంతం వైపు వెళ్లవద్దని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement