ట్రాక్టర్ ఢీకొని ఒకరు మృతి
బాన్సువాడ: బీర్కూర్ మండలం బరంగెడ్గి గ్రా మానికి చెందిన మచ్కురి రాజు (35) అనే వ్యక్తి మంగళవారం రాత్రి ఇటుక ట్రాక్టర్ ఢీకొని మృతి చెందాడు. అయితే, రాజు చెట్టుకు ఢీకొని మృతి చెందినట్లు ఇటుక ట్రాక్టర్ డ్రైవర్ చిత్రీకరించిన విష యం వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. మృతుడు రాజు మిర్జాపూర్‌లో బంధువుల అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా వీరాపూర్ వద్ద ఇటుక బట్టీ ప్రాంతంలో అతివేగంతో వస్తున్న ఇటుక ట్రాక్టర్ బైక్‌ను ఢీకొట్టింది. దీంతో రాజు అక్కడికక్కడే మృతి చెందగా ట్రాక్టర్ డ్రైవర్ రాజు మృతదేహాన్ని చెట్టు పక్కన ఉంచి, చెట్టును ఢీకొని మృతి చెందినట్లు చిత్రీకరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రాజు మృతదేహాన్ని బాన్సువాడ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబసభ్యులకు అనుమా నం వచ్చి ఇటుక బట్టీలో ఉన్న సీసీ కెమెరాను పరిశీలించగా ట్రాక్టర్ ఢీకొన్న దృశ్యాలు రికార్డయ్యాయి. దీంతో రాజు కుటుంబానికి న్యాయం చేయాలని బాధిత కుటుంబసభ్యులు బాన్సువాడలో రాస్తారోకో చేశారు. పోలీసులు వచ్చి న్యాయం చేస్తామని చెప్పడంతో విరమింపజేశారు. కాగా, భార్య పుట్టిన రోజునాడే భర్త రాజు మృతి చెందడంతో కుటుంబీకులు గుండెలవిసెల రోదించారు.
వర్ని: మోస్రా మండల కేంద్రానికి చెందిన కొత్తోళ్ల సుప్రియ (26) అదృశ్యమైనట్లు వర్ని ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపారు. మోస్రా గ్రామానికి చెందిన సుప్రియ కుటుంబకలహాలతో నెల రోజులుగా అదే గ్రామంలో తల్లిగారి ఇంటి వద్ద ఉంటుంది. జనవరి 25న ఇంట్లో నుంచి వెళ్లిన సుప్రియ తిరిగి రాకపోవడంతో బుధవారం పోలీస్ స్టేషన్‌లో తల్లి సవిత ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు.
ఎల్లారెడ్డిరూరల్: మున్సిపాలిటీ పరిధిలోని వడ్డె ర కాలనీకి చెందిన గండికోట మల్లేశ్ (35) మంగళవారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై మహేశ్ బుధవారం తెలిపా రు. మల్లేశ్ కొన్నిరోజులుగా అనారోగ్యంతో బా ధపడుతున్నాడు. ఆస్పత్రిలో చికిత్స పొందినప్పటికీ ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో మా నసికంగా కుంగిపోయి, జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై తెలిపారు. మృతుడి తండ్రి ఎల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
● రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన డ్రైవర్


