కేంద్ర నిధులతోనే మున్సిపాలిటీల అభివృద్ధి
ఎల్లారెడ్డిరూరల్: కేంద్ర ప్రభుత్వ నిధులతోనే మున్సిపాలిటీల అభివృద్ధి జరుగుతోందని బీజేపీ కేంద్ర నాయకులు, రాష్ట్ర కో–కన్వీనర్ అశోక్ అన్నారు. ఎల్లారెడ్డిలో గురువారం బీజేపీ నాయకుల సమావేశం అనంతరం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల అభివృద్ధికి నిధుల కేటాయింపులో మొండి చేయి చూపుతున్నదన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా పట్టణాల అభివృద్ధి జరుగుతుందన్నారు. బీజేపీ కౌన్సిలర్లను గెలిపించాలని ఓటర్లను కోరారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు, రవీందర్రావు, లింగారావు, రాజ్ మోహన్ రెడ్డి, బాలకిషన్, హనుమాండ్లు, నర్సింలు, రాజేష్, క్రాంతి కుమార్, శ్రీనివాస్, గంగారెడ్డి, భాస్కర్‌రెడ్డి, దత్తు, రాములు పాల్గొన్నారు.


