ఒక్క అవకాశం ఇవ్వండి | - | Sakshi
Sakshi News home page

ఒక్క అవకాశం ఇవ్వండి

Feb 4 2026 8:45 AM | Updated on Feb 4 2026 8:45 AM

ఒక్క

ఒక్క అవకాశం ఇవ్వండి

తాండూరు టౌన్‌: కౌన్సిలర్‌గా ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్‌ పార్టీ 19వ వార్డు అభ్యర్థి జుంటుపల్లి వెంకటేశ్‌ కోరారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా మంగళవారం ఆయన తన మద్దతుదారులతో కలసి ఇంటింటి ప్రచారం చేశారు. హస్తం గుర్తుకు ఓటు వేసి ఆదరిస్తే.. వార్డును అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని చెప్పారు.

రైతులు ఆందోళన చెందొద్దు

ఆర్‌ఐ వెంకటేశ్‌

దోమ: రేడియల్‌ రింగు రోడ్డులో భూములు కోల్పోతున్న రైతులు ఆందోళన చెందొద్దని మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్‌ సూచించారు. మంగళవారం మండల పరిధిలోని మోత్కూర్‌, ఖమ్మంనాచారం గ్రామాలలో రేడియల్‌ రింగు రోడ్డు వెళ్తున్న భూములను పరిశీలించి సర్వే చేశారు. ఈ సందర్భంగా ఆర్‌ఐ మాట్లాడుతూ.. భూములు కోల్పోతున్న రైతులను ప్రభుత్వం ఆదుకుంటోందన్నారు. రైతులతో సమావేశం ఏర్పాటు చేసి పరిహారం విషయంలో చర్చిస్తారని చెప్పారు. ప్రతీ రైతుకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సర్వేయర్‌ కిరణ్‌కుమార్‌, రైతులు తదితరులు పాల్గొన్నారు.

ఇసుక ట్రాక్టర్‌ పట్టివేత

యాలాల: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఐ విఠల్‌రెడ్డి కథనం ప్రకారం.. మండల పరిధి బానాపూర్‌ గ్రామ శివారులో మంగళవారం తెల్లవారు జామున ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను.. రాత్రి విధులు నిర్వహిస్తున్న పోలీసులు పట్టుకున్నారు. ఎలాంటి అను మతి లేకుండా ఆ గ్రామానికి చెందిన జర్పుల నీళ్యానాయక్‌ ఇసుకను తరలిస్తున్నట్లు గుర్తించారు. ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

మతిస్థిమితం లేని వ్యక్తిని కుటుంబీకులకు అప్పగింత

కడ్తాల్‌: మానసిక స్థితి సరిగా లేని ఓ వ్యక్తిని గుర్తించిన కడ్తాల్‌ పోలీసులు కుటుంబ సభ్యులకు మంగళవారం అప్పగించారు. సీఐ గంగాధర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ మండలం గుడిబండతండాకు చెందిన బాణవత్‌ రాంచందర్‌ ఇటీవల మానసిక పరిస్థితి సరిగా లేక ఇంటి నుంచి వెళ్లిపోయాడు. మండల కేంద్రంలో అన్మాస్‌పల్లి కూడలిలో తిరుగుతున్నాడు. విషయం తెలుసుకున్న కడ్తాల్‌ పోలీస్‌ సిబ్బంది, అతన్ని క్షేమంగా పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. వివరాలు సేకరించి కుటుంబ సభ్యులకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు రాంచందర్‌ను అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ఒక్క అవకాశం ఇవ్వండి 1
1/3

ఒక్క అవకాశం ఇవ్వండి

ఒక్క అవకాశం ఇవ్వండి 2
2/3

ఒక్క అవకాశం ఇవ్వండి

ఒక్క అవకాశం ఇవ్వండి 3
3/3

ఒక్క అవకాశం ఇవ్వండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement