బరి.. అభ్యర్థుల గురి
మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో హడావుడి నెలకొంది. నామినేషన్ల పర్వం, స్క్రూట్నీ, బుజ్జగింపులు, ఉపసంహరణ, అభ్యర్థులు, వారికి గుర్తుల కేటాయింపు ముగిసింది. మద్దతుదారులతో ప్రచారం జోరందుకుంది.
కొడంగల్: కొడంగల్ పురపాలకలో పార్టీల వారీగా అభ్యర్థులు ఖరారు అయ్యారు. ఎన్నికల బరిలో 34 మంది పోటీలో ఉన్నారు. 12 వార్డులకు 12 మంది కాంగ్రెస్ అభ్యర్థులు, బీఆర్‌ఎస్ 9, బీజేపీ రెండు, ఎంఐఎం రెండు, సీపీఐ(ఎం) ఒక వార్డు కాగా.. స్వతంత్రులు 8 మంది బరిలో ఉన్నారు.
వార్డుల వారీగా..
ఒకటి జగదీశ్వర్‌రెడ్డి(కాంగ్రెస్), గుల్షన్(ఎంఐఎం), రెండులో ఊట్కూర్ మంజుల (కాంగ్రెస్), వాణిశ్రీ యాదవ్(బీఆర్‌ఎస్), మూడులో గొల్ల లక్ష్మమ్మ(కా), సోన(బీ), నాలుగులో నందారం ప్రశాంత్(కా), బాలరాజ్(బీ), ఐదులో బాలమ్మ(కా), శ్యామమ్మ(బీ), ఆరో వార్డులో సయ్యద్ హమీద్ అలీ(కా), గంటి సురేష్‌కుమార్ సీపీఐ(ఎం), పవన్‌కుమార్ లాహోటీ, మహ్మద్ అలీ స్వతంత్ర అభ్యర్థులు. ఏడులో కృష్ణంరాజు (కా), మహేశ్ బాబు (బీజేపీ), కె.వెంకటయ్య (స్వతంత్ర). 8లో శంకర్(కా), కిషన్(బీ), పూజ, వనితా స్వతంత్ర అభ్యర్థులు. 9లో గంట మంజుల (కా), అమీనా బేగం(బీ), సన ఆప్రీనా (మజ్లిస్), 10లో రాజశేఖర్ (కా), చంద్రశేఖర్ (బీ), 11లో అనిత (కా), మంజుల (బీ), లక్ష్మీ (బీజేపీ), 12లో సుష్మ(కా), లలిత(బీ), అంజిలమ్మ, బుడ్డ శ్రావణి, మాల శ్రావణి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు.
పార్టీల వారీగా గెలుపుగుర్రాల ఎంపిక
మద్దతు దారులతో విస్తృతంగా ప్రచారం
కొడంగల్ మున్సిపాలిటీలో.. 34 మంది
అభ్యర్థులకు బీఫారాలు
అందజేసిన నేతలు
బరి.. అభ్యర్థుల గురి


