విద్యుదాఘాతంతో ఉపాధ్యాయుడు మృతి
యాలాల: విద్యుదాఘాతంతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధి కోకట్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మహ్మద్ మహమూద్(46), రాస్నం ఉన్నత పాఠశాలలో హిందీ పండిట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. వారికి చెందిన పిండి గిర్ని మర మ్మతుకు గురైంది. సమస్యను పరిష్కరించి, పాఠశాలకు వెళ్లాలన్న ఉద్దేశంతో రిపేర్ చేస్తుండగా.. కరెంట్ షాక్‌కు గురై అక్కడే పడిపోయాడు. గమనించిన కుటుంబీకులు అతన్ని తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెంది నట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి భార్య ఫర్జా న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపారు. మృతుడికి భార్య, కూతుర్లు హుమేరా, నమీరా, జునేరా, కొడుకులు ముక్సీద్, రయాన్ ఉన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.
పీఆర్టీయూ నాయకుల సంతాపం
మహమూద్ మృతికి పీఆర్టీయూ మండల శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కృష్ణారెడ్డి, రాములు సంతాపం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుడు మృతి బాధాకరమన్నారు. మృతుడు యూనియన్‌లో కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారని తెలిపారు. బాధిత కుటుంబాన్ని సర్పంచ్ రాజేందర్‌రెడ్డి, ఉప సర్పంచ్ నరేష్, మాజీ ఎంపీటీసీ శంకర్ తదితరులు పరామర్శించారు.


