నీటి కటకట రానీయొద్దు | - | Sakshi
Sakshi News home page

నీటి కటకట రానీయొద్దు

Feb 4 2026 8:45 AM | Updated on Feb 4 2026 8:45 AM

నీటి

నీటి కటకట రానీయొద్దు

రాబోయే పాలకవర్గానికి

మున్సిపల్‌ ప్రజల సూచన

గెలిచిన వెంటనే నీటి సరఫరాకు

ప్రణాళిక రచించాలని అభ్యర్థన

కొడంగల్‌: మున్సిపల్‌ పరిధిలోని కొండారెడ్డిపల్లి, బూల్కాపూర్‌, ఐనన్‌పల్లి, పాత కొడంగల్‌, పాత కొడంగల్‌తండా, గుండ్లకుంట గ్రామాల్లో ప్రజల అవసరాలకు సరిపడా నీటి సరఫరా జరగడం లేదని స్థానికులు చెబుతున్నారు. 2018లో కొడంగల్‌ మేజర్‌ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్‌ అయింది. అప్పటి నుంచి నేటి వరకు తమ నీటి అవసరాలు తీరడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. నేటికీ పలు కాలనీలకు పూర్తి స్థాయిలో తాగునీరు అందడం లేదు. కొడంగల్‌ మున్సిపాలిటీలో 16 వేలకు పైగా జనాభా ఉంది. పట్టణంలోని కార్గిల్‌ కాలనీ సమీపంలో నిర్మిస్తున్న ఓవర్‌ హెడ్‌ ట్యాంకు నిర్మాణం పూర్తయితే కార్గిల్‌ కాలనీ, శాంతినగర్‌ కాలనీలకు నీటి సరఫరాలో ఇబ్బంది ఉండదని అధికారులు చెబుతున్నారు.

రోజూ కష్టమే

నిత్యం తాగునీరు సరఫరా చేయాలి. ఒక్కోసారి ఇబ్బంది ఏర్పడుతోంది. గతంలో బోరుమోటారు ద్వారా సరఫరా చేసేవారు. ప్రస్తుతం కొడంగల్‌ నుంచి నీళ్లు వస్తున్నాయని చెబుతున్నారు. రానున్న పాలకవర్గం ప్రజల అవసరాలకు అనుగుణంగా నిత్యం నీటి సరఫరా అందించాలి. – లక్ష్మి, కొండారెడ్డిపల్లి

నీటి కటకట రానీయొద్దు 1
1/2

నీటి కటకట రానీయొద్దు

నీటి కటకట రానీయొద్దు 2
2/2

నీటి కటకట రానీయొద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement