ఓటమి భయంతో అసత్య ప్రచారం | - | Sakshi
Sakshi News home page

ఓటమి భయంతో అసత్య ప్రచారం

Feb 9 2026 8:55 AM | Updated on Feb 9 2026 8:55 AM

ఓటమి భయంతో అసత్య ప్రచారం

ఓటమి భయంతో అసత్య ప్రచారం

పరిగి: ఓటమి భయంతోనే బీఆర్‌ఎస్‌, బీజేపీలు కాంగ్రెస్‌ చైర్మన్‌ అభ్యర్థి ఎంపికపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఆదివారం తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. పరిగి మున్సిపాలిటీ ఎన్నికల్లో 18వార్డుల కౌన్సిలర్ల గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు చూసి ప్రజలు మా వేపే ఉన్నారని, ఇది చూసి ఓర్వలేని ప్రతిపక్ష నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, వారి మాటలు నమ్మవద్దని సూచించారు.

రూ.50 కోట్లతో అభివృద్ధి

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక పరిగిని కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే చెప్పారు. ఇప్పటికే పట్టణంలో రూ.50 కోట్లతో సీసీరోడ్ల నిర్మాణాలు తదితర పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎవరికీ కొమ్ము కాయదని, అభ్యర్థులు అందరూ గెలిచాక చైర్మన్‌ పదవికి సమర్థులైన వారిని ఎన్నుకుంటామని స్పష్టం చేశారు. అసత్య ప్రచారం నమ్మకుండా.. అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో పార్థసారథి, ఎర్రగడ్డపల్లి కృష్ణ, పాలాద్రి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

చెర్మన్‌ అభ్యర్థిని ప్రకటించలేదు

విజయానంతరం సమర్థులను ఎన్నుకుంటాం

ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement