కౌన్సిలర్‌ అక్కమ్మను అప్పగించండి | - | Sakshi
Sakshi News home page

కౌన్సిలర్‌ అక్కమ్మను అప్పగించండి

Feb 16 2026 8:48 AM | Updated on Feb 16 2026 8:48 AM

కౌన్స

కౌన్సిలర్‌ అక్కమ్మను అప్పగించండి

పరిగి: పరిగి మున్సిపాలిటీ 1వ వార్డు నుంచి గెలుపొందిన కుర్వ అక్కమ్మను బీఆర్‌ఎస్‌ నాయకులు కిడ్నాప్‌ చేశారని.. ఆమెను వెంటనే తమకు అప్పగించాలని కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆదివారం వారు కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. మున్సిపల్‌ ఫలితాలు వెలువడిన నాటి నుంచి అక్కమ్మ కనిపించకపోవడంతో కాంగ్రెస్‌ నాయకుల మద్దతుతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం కౌన్సిలర్‌ భర్త నాగయ్య మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ నేతలే తన భార్యను కిడ్నాప్‌ చేఽశారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌కు మద్దతు తెలపాలని అక్రమాలకు పాల్పడుతున్నారని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు తన భార్యను తీసుకురావడంలో విఫలమయ్యారని తనకు న్యాయం చేసేంత వరకు కదిలేది లేదని భీష్మించుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు లాల్‌కృష్ణ, రహీంపటేల్‌ తదితరులు పాల్గొన్నారు.

డీఎస్పీ కార్యాలయం ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన

కౌన్సిలర్‌ అక్కమ్మను అప్పగించండి 1
1/1

కౌన్సిలర్‌ అక్కమ్మను అప్పగించండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement