అనంతగిరి: వికారాబాద్ పట్టణంలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. దాదాపు గంట పాటు వాన పడింది. ప్రధాన రోడ్లు జలమయంగా మారాయి. కొద్దిరోజులుగా ఎండ తీవ్రతతో అల్లాడిన జనం ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ఊపిరి పీల్చుకున్నారు. పలు చోట్ల వడగండ్ల వాన పడింది.
వీధి కుక్కల దాడిలో
జింక మృతి
మర్పల్లి: వీధి కుక్కల దాడిలో జింక మృతి చెందిన ఘటన మండలంలోని సిరిపురం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలాల్లోకి ఉదయం జింక వచ్చింది. దీంతో వీధి కుక్కలు వెంటపడి దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన జింక రోడ్డుపై కుప్పకూలింది. గమనించిన ప్రజలు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని వెటర్నరీ డాక్టర్ నరేంద్రనాథ్ పిలిపించారు. పరీక్షించిన వైద్యుడు అప్పటికే జింక మృతి చెందినట్లు ధ్రువీకరించారు.
తాండూరు ఎంఈఓగా
హిందుప్రియ
తాండూరు రూరల్: తాండూరు ఎంఈఓగా హిందుప్రియ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న వెంకటయ్యగౌడ్ ఉద్యోగ విరమణ పొందడంతో ఆయన స్థానంలో సీనియారిటీ ప్రకారం పాత తాండూరు ఉర్డూ మీడియం పాఠశాల జీహెచ్‌ఎం హిందు ప్రియకు బాధ్యతలు అప్పగిస్తూ డీఈఓ రేణుకాదేవి ఉత్తర్వులు జారీ చేశారు. ఆమెను ఉపాధ్యాయులు నారాయణగౌడ్, మహమ్మద్ ఖుద్దూస్, అబ్దుల్ రహ్మన్, ఒమర్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
మాజీ మంత్రి హరీశ్‌రావుకు ఘన స్వాగతం
నేడు డయల్ యువర్ డీఎం
షాద్‌నగర్‌రూరల్: ఆర్టీసీ ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు శనివారం డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు షాద్‌నగర్ డిపో మేనేజర్ ఉష శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రయాణికులు తమ సమస్యలు, సూచనలు, సలహాలను తెలియజేయాలని కోరారు. 99592 26287 నంబర్‌లో సంప్రదించాలని ఆమె సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.


