భూములిచ్చే ప్రసక్తే లేదు | - | Sakshi
Sakshi News home page

భూములిచ్చే ప్రసక్తే లేదు

Apr 4 2026 9:01 AM | Updated on Apr 4 2026 9:01 AM

ఎవరు ఆపుతారో చూద్దాం బీఆర్‌ఎస్‌ అండగా ఉంటుంది మాజీ మంత్రి సబితారెడ్డి రాపోల్‌, కళ్లాపూర్‌ భూ బాధితులకు సంఘీభావం

పరిగి: పచ్చటి పొలాలను లాక్కోని పరిశ్రమ లు ఏర్పాటు చేయడం సరికాదని, వెంటనే భూ సేకరణ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మండలంలోని రాపోల్‌, కళ్లాపూర్‌ గ్రామాల్లో పది రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న రైతులకు శుక్రవారం సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం సేకరించాలని నిర్ణయించిన పంట పొలాలను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఏడాదికి మూడు పంటలు పండే పొలాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయడం ఏంటని ప్రశ్నించారు. భూములను కాపాడుకునేందుకు రైతులు పోరాటం చేస్తుంటే అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాతల ఓట్ల తో గెలిచి వారిపైనే అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. రైతుల గొంతు నొక్కేందుకు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుల తరఫున కొట్లాడుతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు కోసం 30వేల ఎకరాల భూమిని సేకరించారని, వాటి ని కేటాయించాలని సూచించారు. సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రియల్‌ దందా చేస్తున్నారని ఆరోపించారు.మాజీ సీఎం కేసీఆర్‌ ఆదేశాలతోనే ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. త్వరలో కేటీఆర్‌, హరీశ్‌రావు వస్తారని పేర్కొన్నారు. బాధిత రైతులకు బీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వానికి భూములు ఇచ్చే ప్రసక్తే లేదని.. రైతులు ధైర్యంగా పంటలు వేసు కోవాలని సూచించారు. ఎవరు ఆపు తారో చూద్దామన్నారు. అనంతరం రెండు గ్రామాల మహిళా రైతులు మాట్లాడారు. తాము పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తు న్నామని తెలిపారు. ప్రభుత్వం బలవంతంగా మా భూ ములు లాక్కొని రోడ్డున పడేయాలని చూస్తోందని ఆరోపించారు. తమతో చర్చించకుండా ఎలా నోటిఫికేషన్‌ ఇస్తారని ప్రశ్నించారు.

ఎర్రమట్టిపై కన్ను

అనంతరం మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి మాట్లాడారు. ఎన్నికల హామీలను అమలు చేయకుండా రైతుల భూములను లాక్కుంటున్నారని విమర్శించారు. ఇక్కడ ఎర్రమట్టి ఉంది కాబట్టి ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డికి ఈ భూములపై కన్ను పడిందన్నారు. ఎర్రమట్టి దందా కోసం కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. బాధితులపై అక్రమ కేసులు పెడితే ఊరుకునేది లేదన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్‌, పార్టీ మండల అధ్యక్షుడు ఆర్‌ ఆంజనేయులు, సీనియర్‌ నాయకులు ప్రవీణ్‌రెడ్డి, అరవింద్‌రావు, సురేందర్‌, భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

రైతులు ధైర్యంగా సాగు చేసుకోవాలి

‘రేడియల్‌’తో తీవ్ర అన్యాయం

దోమ: రేడియల్‌ రోడ్డు, ఇండస్ట్రియల్‌ పార్క్‌ పేరుతో ప్రభుత్వం పంట పొలాలను లాక్కోవాలని చూస్తోందని మండలంలోని బట్లచందారం రైతులు ఆరోపించారు. శుక్రవారం పరిగి మండలం రాపోల్‌ గ్రామానికి వచ్చిన మాజీ మంత్రి సబితారెడ్డిని జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కొప్పుల వెంకటనాగిరెడ్డి, మాజీ వైస్‌ ఎంపీపీ మల్లేశం, మాజీ సర్పంచ్‌ రాములుతో కలిసి వినతిపత్రం అందజేశారు. మా గ్రామ పరిధిలోనే సుమారు 235 ఎకరాలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైందని కన్నీటిపర్యంతమయ్యారు. ఏళ్ల తరబడి పంటలు పండించుకుంటూ జీనవం సాగిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్యాయంగా భూములను తీసుకునేందుకు చర్యలు చేపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు న్యాయం జరిగేలా చొరవ చూపా లని రైతులు సబితారెడ్డిని కోరారు. స్పందించిన ఆమె ధైర్యంగా ఉండాలని, మీ తరఫున బీఆర్‌ఎస్‌ పోరాటం చేస్తోందని హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement