● కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి
మహేశ్వరం: మండలంలోని మన్సాన్‌పల్లి, మంఖాల్ గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూం కాలనీలలో ఖాళీగా ఉన్న వాణిజ్య దుకాణాలను విక్రయించడానికి జిల్లా కలెక్టర్, హౌసింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల 10న బహిరంగ వేలం నిర్వహిస్తున్నామని కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మండలంలోని మంఖాల్ ఫేజ్–2(తుక్కుగూడ దగ్గరలో) 35 దుకాణాలు వాటి విస్తీర్ణం 189 చ. అడుగుల నుంచి 231 చ.అడుగుల వరకు ఉంటుంది. ప్రతి చదరపు అడుగు రూ.2,500గా నిర్ణయించారు. మన్సాన్‌పల్లి ఫేజ్–1, 2(మహేశ్వరం దగ్గరలో) మొత్తం దుకాణాలు 57 వాటి విస్తీర్ణం 130 చదరపు అడుగుల నుంచి 266 చదరపు అడుగుల వరకు, ప్రతి చదరపు అడుగు రూ.2000 నుంచి 2200 వరకు ఉంటుందన్నారు. ఈఎండీ మొత్తం రూ.36 వేలు ఏదైన జాతీయ బ్యాంకు నుంచి జిల్లా కలెక్టర్ రంగారెడ్డి జిల్లా పేరు మీద డిమాండ్ డ్రాఫ్ట్(డీడీ) తీసీ వేలం పాల్గొనాలని సూచించారు. పూర్తి వివరాలకు పీడీ హౌసింగ్ మేనేజర్ 9063191168, పీడీ హౌసింగ్ 8712032727, ఆర్డీఓ కార్యాలయం డీటీ 7601055677 ఫోన్ నంబర్లకు సంప్రదించాలని కోరారు.


