పీఠంపై‘చేయి’ | - | Sakshi
Sakshi News home page

పీఠంపై‘చేయి’

Feb 16 2026 8:48 AM | Updated on Feb 16 2026 8:48 AM

పీఠంపై‘చేయి’

పీఠంపై‘చేయి’

మొయినాబాద్‌: కొత్తగా ఏర్పడిన మొయినాబాద్‌ మున్సిపాలిటీ మొట్టమొదటి చైర్‌పర్సన్‌ హస్తానికే దక్కనుంది. అధిక స్థానాలు గెలిచిన కాంగ్రెస్‌ పార్టీ.. స్వతంత్రుల మద్దతుతో మున్సిపాలిటీపై కాంగ్రెస్‌ జెండా ఎగరేయడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యే కాలె యాదయ్య, నియోజకవర్గ ఇన్‌చార్జి భీంభరత్‌, రాజేంద్రనగర్‌కు చెందిన జ్ఞానేశ్వర్‌ రంగంలోకి దిగి అధికారం చేజారకుండా ఎత్తులు వేశారు. 10 మంది కాంగ్రెస్‌ సభ్యులకు మరో ఐదు మంది స్వతంత్రుల మద్దతు కూడగట్టారు. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ సభ్యుడు కాంగ్రెస్‌ శిబిరంలోనే ఉండటంతో పార్టీకి బలం 16కు చేరింది. దీంతో కాంగ్రెస్‌ సభ్యురాలు దుబ్బ సోనియాను చైర్‌పర్సన్‌ చేసేందుకు మార్గం సుగమం చేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్‌లోనే మరో సభ్యురాలు గీతా వనజాక్షి సైతం చైర్‌పర్సన్‌ పదవీ కోసం పట్టుబట్టినట్లు విశ్వసనీయ సమాచారం.

కాంగ్రెస్‌ గూటికి స్వతంత్రులు..

స్వతంత్ర అభ్యర్థులుగా గెలుపొందిన ఐదుగురు కాంగ్రెస్‌ శిబిరంలో చేరినట్లు తెలుస్తోంది. 22వ వార్డు కౌన్సిలర్‌గా గెలుపొందిన గరుగు రాజు వైస్‌ చైర్మన్‌ పదవీ కోసం తీవ్ర ప్రయ్నాలు చేస్తున్నారు. తనకు ఎవరు వైస్‌ చైర్మన్‌ పదవీ ఇస్తే వారికి మరో ఇద్దరు స్వతంత్రులతో కలిసి మద్ద్దతు ఇస్తానని రెండు రోజులుగా వేరుగా శిబిరం పెట్టారు. ఇద్దరు స్వతంత్రులు గౌర అనసూయ, మహేశ్‌కు గరుగు రాజు ఇప్పటికే భారీగా నజరానా ఇచ్చినట్లు తెలిసింది. రాజేంద్రనగర్‌ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్‌ నేత జ్ఞానేశ్వర్‌తో గరుగు రాజు వైస్‌ చైర్మన్‌ పదవీ కోసం రాయబారం పంపి సఫలీకృతమైనట్లు సమాచారం. కాంగ్రెస్‌ వైస్‌ చైర్మన్‌ హామీ ఇవ్వడంతో గరురు రాజు ఇద్దరు స్వతంత్రులతో కలిసి కాంగ్రెస్‌ శిబిరంలోకి వెళ్లినట్లు తెలిసింది. ఇంకో ఇద్దరు కాంగ్రెస్‌ రెబల్స్‌గా పోటీ చేసి గెలుపొందిన స్వతంత్రులు సైతం కాంగ్రెస్‌కే మద్దతు పలికారు. వారితో మంత్రి శ్రీధర్‌బాబు చర్చలు జరిపినట్లు తెలిసింది.

వైస్‌ చైర్మన్‌ కోసం ‘పల్లగొల్ల’ పట్టు

మొయినాబాద్‌ మున్సిపాలిటీ వైస్‌ చైర్మన్‌ పదవీ కోసం ఓ వైపు స్వతంత్ర సభ్యడు గరుగు రాజుకు ఇస్తున్నట్లు వినిపిస్తుండగా.. మరోవైపు 10వ వార్డు కాంగ్రెస్‌ సభ్యురాలు పల్లగొల్ల విజయలక్ష్మి పట్టుబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. జూబ్లీహిల్‌ ఎమ్మెల్యే నవీన్‌యాదవ్‌కు పల్లగొల్ల విజయలక్ష్మి దగ్గరి బంధువు కావడంతో ఆమెను వైస్‌ చైర్‌పర్సన్‌గా చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. అందుకోసం స్వయంగా నవీన్‌యాదవ్‌ రంగంలోకి దిగినట్లు సమాచారం. దీంతో వైస్‌ చైర్మన్‌ పదవీపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రయత్నాలు చేసి వెనక్కి తగ్గిన బీఆర్‌ఎస్‌, బీజేపీ మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పీఠాలు దక్కించుకోవాలని బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలు ఆదివారం తీవ్ర ప్రయ్నాలు చేశాయి. స్వతంత్రుల మద్ధతుతో బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలు కోరంకు కావాల్సిన సభ్యుల మద్ధతు కూడగట్టేందుకు శ్రమించారు. మాజీ మంత్రి సబితారెడ్డి సైతం రంగంలోకి దిగి ప్రయత్నాలు చేసినా వారి ప్రయత్నాలు ఫలించలేదు. స్వతంత్ర అభ్యర్థులు అధికార పార్టీవైపే మొగ్గు చూపడంతో వారి ప్రయత్నాలు మానుకున్నారు.

మొదటి చైర్‌పర్సన్‌గా కాంగ్రెస్‌కే అవకాశం

వైస్‌ చైర్మన్‌పై గరుగు(రి)

పట్టు వదలని ‘పల్లగొల్ల’

కాంగ్రెస్‌ శిబిరంలోకి చేరిన స్వతంత్రులు

ప్రయత్నాలు చేసి వెనక్కి తగ్గిన బీఆర్‌ఎస్‌, బీజేపీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement