ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు

Feb 16 2026 8:48 AM | Updated on Feb 16 2026 8:48 AM

ప్రమా

ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు

7వ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా ప్రమాణం చేయనున్న అనన్య

అనంతగిరి: వికారాబాద్‌ మున్సిపల్‌ 7వ పాలకవర్గం సోమవారం కొలువుదీరనుంది. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలుత కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 7వ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ కూతురు అనన్య ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టబోతున్నారు. కాగా వైస్‌చైర్మన్‌ ఎవరనే విషయంలో స్పష్టత రాలేదు. వైస్‌చైర్మన్‌ రేసులో ప్రధానంగా సుధాకర్‌రెడ్డి, చిగుళ్లపల్లి రమేష్‌కుమార్‌, విశ్వనాథం రాఘవేందర్‌, లంకా లక్ష్మీకాంత్‌రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

శివాజీ విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ

కుల్కచర్ల: యువత ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకోవాలని పీఆర్టీయూ రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్‌ రెడ్డి, బీజేపీ జిల్లా కార్యవర్గసభ్యుడు బందయ్య అన్నారు. ఆదివారం చౌడాపూర్‌ మండల కేంద్రంలో శివాజీ విగ్రహా ఏర్పాటుకు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో బి.వెంకటేశ్‌, అశోక్‌, శివకుమార్‌, శ్రీకాంత్‌, కల్యాణ్‌, రాజు, నర్సింలు, లింగం, గౌరీశంకర్‌, రమేశ్‌, బాలరాజ్‌, తదితరులు పాల్గొన్నారు.

ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత

పరిగి సివిల్‌ కోర్టు జడ్జి శిల్ప

కుల్కచర్ల: ఆధ్యాత్మికచింతనతో మానసిక ప్ర శాంతత చేకూతుందని పరిగి సివిల్‌ కోర్టు జడ్జి నాగుల శిల్ప అన్నారు. ఆదివారం ఆమె బండవెల్కిచర్ల గ్రామ పరిధిలోని పాంబండ రామలింగేశ్వర స్వామికి కుటుంబ సమేతంగా పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరు భక్తిభావాన్ని అలవర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ రమేశ్‌, ఆలయ ఈఓ బాలనర్సయ్య, ఆలయ కమిటీ మాజీ చైర్మన్‌ మైపాల్‌రెడ్డి, సర్పంచ్‌ శ్రీను, ఉపసర్పంచ్‌ గోవర్దన్‌రెడ్డి, అర్చకులు పాండు తదితరులు పాల్గొన్నారు.

చోరీ కేసులో ఇద్దరు అరెస్ట్‌

అత్తాపూర్‌: వెండి ఆభరణాల చోరీ కేసులో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించిన సంఘటన అత్తాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. ఇన్‌స్పెర్టర్‌ నాగేశ్వరరావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సులేమాన్‌నగర్‌ ప్రాంతానికి చెందిన అజ్రాబేగం, భర్త వాజిద్‌తో కలిసి నౌనెంబర్‌ ప్రాంతంలోని ఓ నగల దుకాణంలో గోల్డ్‌లోన్‌కు సంబంధించి వడ్డీని చెల్లించేందుకు వెళ్లారు. ఇంటికి వచ్చేసరికి బీరువా తెరిచి ఉండడంతో తనిఖీ చేయగా ఐదు గ్రాముల బంగారు, 30 తులాల వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా చింతల్‌మెట్‌కు చెందిన మహ్మద్‌ జూనూద్‌, సయ్యద్‌ నయాబ్‌లను నిందితులుగా గుర్తించి వారికి అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. నిందితులపై గతంలో హత్యాయత్నం కేసు నమోదై ఉన్నట్లు తెలిపారు.

ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు 1
1/3

ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు

ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు 2
2/3

ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు

ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు 3
3/3

ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement