కాంగ్రెస్‌కు ఓట్లు అడిగే అర్హత లేదు | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు ఓట్లు అడిగే అర్హత లేదు

Feb 8 2026 7:58 AM | Updated on Feb 8 2026 7:58 AM

కాంగ్రెస్‌కు ఓట్లు అడిగే అర్హత లేదు

కాంగ్రెస్‌కు ఓట్లు అడిగే అర్హత లేదు

కొడంగల్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఓట్లు అడిగే అర్హత లేదని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ ఎన్నికల ఇన్‌చార్జ్‌ గట్టు రాంచందర్‌ రావ్‌ అన్నారు. శనివారం పట్టణంలోని పలు వార్డుల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. అంబేడ్కర్‌ చౌరస్తా నుంచి వేంకటేశ్వర స్వామి ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఓట్లు ఎలా అడుగుతారని కాంగ్రెస్‌ నేతలను ప్రశ్నించారు. సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ఎకరానికి రూ.15 వేలు, మహిళలకు రూ.2,500, వృద్ధులు, వితంతులకు రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు పింఛను ఇవ్వలేదన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ జాడే లేదన్నారు. తులం బంగారం ఏమైందో ప్రజలకు చెప్పాలన్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్‌ నాయకులు చెప్పే మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. కొడంగల్‌లో హస్తం పార్టీని ఓడిస్తే ప్రజలకు ఇచ్చిన హామీలు అవుతాయని పేర్కొన్నారు. కొడంగల్‌కు మంజూరు చేసిన మెడికల్‌ కళాశాలను, విద్యా సంస్థలను లగచర్లకు తరలించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు, బీఆర్‌ఎస్‌ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే పట్నం, బీఆర్‌ఎస్‌ ఎన్నికల ఇన్‌చార్జ్‌ గట్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement