ఆదివారం శ్రీ 8 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
న్యూస్‌రీల్
అనంతగిరిని అభివృద్ధి చేయండి
బహిరంగ సభకు హాజరైన కార్యకర్తలు, నాయకులు
ఎన్ని నిధులైనా ఇస్తా
పరిగి/వికారాబాద్: గోదావరి జలాలను జిల్లాకు తెచ్చి పరిగి, వికారాబాద్, తాండూరు ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం పరిగి మండలం నారాయణపూర్ సమీపంలో నిర్వహించిన ప్రజా పాలన – ప్రగతి బాట బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. జిల్లాకు వరాల జల్లు కురిపించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో రూపొందించిన ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టును కేసీఆర్ ప్రభుత్వం పక్కన పెట్టి మోసం చేసిందన్నారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో రంగారెడ్డికి చుక్కనీరు ఇవ్వలేదని ఆరోపించారు. కేసీఆర్ నిర్లక్ష్యానికి ఉమ్మడి జిల్లా బలైందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీఆర్‌ఎస్ మంత్రి అయిన సబితారెడ్డి జిల్లా ప్రజలకు ఏం చేసిందో చెప్పాలన్నారు. అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు ఉన్న రోడ్డు అడ్డంకులను కూడా తొలగించలేక పోయారని విమర్శించారు. ఎంతో మంది రోడ్డు ప్రమాదంలో చనిపోవడానికి కారకులయ్యారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ఈ సమస్యను తన దృష్టికి తెచ్చి అడ్డంకులను తొలగించడంతో శరవేగంగా పనులు జరుగుతున్నాయని తెలిపారు. పరిగి నలుమూలలా నాలుగు లేన్ల రహదారులు నిర్మిస్తున్నట్లు చెప్పారు. త్వరలో కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి భూ సేకరణ పనులు పూర్తి చేసి పనులను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ప్రాంతాలకు కృష్ణా జలాలు తెచ్చి 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు.
ట్రిపుల్ ఆర్, రేడియల్‌తో మేలు
జిల్లాను ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా మారుస్తామని సీఎం అన్నారు. మన ప్రాంతం మీదుగానే రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్డు వెళ్తాయని తెలిపారు. వికారాబాద్ – తాండూరు రోడ్డు పనులు త్వరలో పూర్తి చేసే బాధ్యత తనదే అన్నారు. రెండేళ్ల తమ పాలనలో పేదలకు అనేక సంక్షేమ పథకాలు అందించామని తెలిపారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందన్నారు. తాండూరు పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులతో పాటు కాగ్నా నది నుంచి తాగునీరు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఏడాదిలోపు ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులను పూర్తి చేసి జిల్లా రూపురేఖలు మారుస్తానని ముఖ్యమంత్రి అన్నారు.
బీఆర్‌ఎస్ కార్యాలయాల్లో బీజేపీ టికెట్లు
మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్ చీకటి ఒప్పందం చేసుకున్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఒకరు చైర్మన్, మరొకరు వైస్ చైర్మన్ పదవులు తీసుకునేందుకు ఒప్పంద్దం జరిగిందన్నారు. బీఆర్‌ఎస్ కార్యాలయాల్లో బీజేపీ అభ్యర్థులకు బీఫారాలు ఇస్తున్నారని తెలిపారు. పట్టణాలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ కౌన్సిలర్లు ఉండాలన్నారు. కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రి శ్రీధర్‌బాబు, మండలి చీఫ్‌విప్ పట్నం మహేందర్‌రెడ్డి, పరిగి, తాండూరు, చేవెళ్ల, రాజేంద్రనగర్ ఎమ్మెల్యేలు టీ రామ్మోహన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, కాలె యాదయ్య, ప్రకాశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుందాం
కుల్కచర్ల: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకుందామని మండలి చీఫ్‌విప్ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. శనివారం జరిగిన సీఎం సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక పురపాలికలను కై వశం చేసుకుంటామన్నారు. ప్రజలు ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు.
గోదావరి జలాలతో జిల్లాను సస్యశ్యామలం చేస్తాం
మక్తల్, నారాయణపేట, కొడంగల్‌కు కృష్ణా జలాలు
కేపీ లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టకు త్వరలో భూ సేకరణ
వికారాబాద్‌ను ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం
ప్రజా పాలన – ప్రగతి బాటలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
జిల్లాకు వరాల జల్లు
నగరానికే పరిమితమైన ఎంఎంటీఎస్ సేవలను వికారాబాద్ వరకు పొడగించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ సీఎంను కోరారు. అనంతగిరిని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్నారు. వికారాబాద్ నియోజకవర్గానికి 5వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్న టెక్స్‌టైల్స్ పార్కును ప్రారంభించి ఈ ప్రాంత యువతకు ఉపాధి కల్పించాలని సీఎంను కోరారు.
ఆదివారం శ్రీ 8 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
ఆదివారం శ్రీ 8 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
ఆదివారం శ్రీ 8 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
ఆదివారం శ్రీ 8 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
ఆదివారం శ్రీ 8 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026


