అవినీతి పగుళ్లు! | - | Sakshi
Sakshi News home page

అవినీతి పగుళ్లు!

Apr 2 2026 12:06 PM | Updated on Apr 2 2026 12:06 PM

వికారాబాద్‌: జిల్లాలోని ఆయా మార్గాల్లోని వంతెనలు ప్రమాదకరంగా మారాయి. అధికారులు.. కాంట్రాక్టర్లు కుమ్మకై ్క నాణ్యతాప్రమాణాలు పాటించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. నాసిరకం పనులపై సాక్షి దినపత్రికలో పలుసార్లు కథనాలు వచ్చాయి. ఆ సమయంలో ఆర్‌అండ్‌బీ ఉన్నతాధికారులు, అప్పటి కలెక్టర్‌ ఽథర్డ్‌పార్టీ ఎంకై ్వరీకి ఆదేశించారు. బ్రిడ్జిలను పరిశీలించిన ప్రత్యేక అధికారులు నివేదికలు ఇచ్చారు. అవి బుట్టదాఖలయ్యాయి. వాటిని బయట పెట్టలేదు. పర్యవేక్షణాధికారులు, కాంట్రాక్టర్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాంట్రాక్టర్లకు అధికారులు వంతపాడటం చూస్తే పలు అనుమానాలకు తావిస్తోంది. రంధ్రాలు పడినంత మాత్రన నాణ్యత లేనట్టు కాదని.. ఇంజనీరింగ్‌ లోపం ఉన్నట్లు చెప్పలేమని ఈఈ స్థాయి అధికారే అనడం గమనార్హం. ఏ లోపం లేకపోయినా అప్పుడప్పుడు బ్రిడ్జిలు కూలుతుంటాయని సెలవిచ్చారు. పాడైన వాటికి పైన సిమెంట్‌ పూత పూసి చేతులు దులుపుకొంటున్నారు.

నాణ్యతకు తిలోదకాలు..

అభివృద్ధి పనుల్లో క్వాలిటీ పూర్తిగా కంట్రోల్‌ తప్పుతోంది. ఆర్‌అండ్‌బీ ఆధ్వర్యంలో చేపట్టే పనుల్లో నాణ్యత మచ్చుకై నా కనిపించడంలేదు. వందేళ్లు నిలవాల్సిన నిర్మాణాలు ఏడాది.. రెండేళ్లకే పాడవుతున్నాయి. పనులు ఏవైనా పర్సెంటేజీలే పరమావధిగా వ్యవహారం సాగుతోంది. కింది స్థాయి ఉద్యోగులు వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌, ఏఈ మొదలు డీఈలు, ఈఈ స్థాయి అధికారులు, చివరకు క్వాలిటీ కంట్రోల్‌ అధికారుల వరకు అంతా మామూళ్ల మత్తులోనే మునిగి తేలుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్టర్లు ఇసుకకు బదులు డస్టు వినియోగిస్తున్నారు. చాలా చోట్ల 20 శాతం ఇసుక 80 శాతం డస్టు కలపడం వల్ల నాణ్యత ఉండటం లేదు. ఇంకొన్ని చోట్ల వంద శాతం డస్టే వాడుతున్నారు. మార్కెట్‌లో లారీ డస్టు రూ.9 వేల నుంచి రూ.10 వేల లోపు దొరుకుతుంది. అదే ఇసుక అయితే రూ.40 వేల నుంచి రూ.50 వేలకు వెచ్చించాల్సి ఉంటుంది. ఈ కారణంగానే కాంట్రాక్టర్లు డస్టు వాడి సొమ్ము చేసుకుంటున్నారు. నిబంధనల మేరకు స్టీల్‌, ఇతర సామగ్రి కూడా వాడటం లేదనే విమర్శలు ఉన్నాయి.

ప్రజాధనం వృథా

ప్రతి ఏటా వంతెనలు, బ్రిడ్జిలు, బీటీ, సీసీ రోడ్లు, భవన నిర్మాణాల కోసం ప్రభుత్వం వందల కోట్లు విడుదల చేస్తోంది. పనులు ఏళ్లపాటు సాగడంతో నిర్మాణ వ్యయం కూడా రెట్టింపు అవుతోంది. పనులు నత్తనడకన సాగితే నాణ్యత లేకపోవడంతో తక్కువ వ్యవధిలో దెబ్బతింటున్నాయి. దీంతో వందల కోట్ల ప్రజా ధనం వృథా అవుతోంది.

ప్రారంభించిన రెండేళ్లకే

దెబ్బతింటున్న వంతెనలు

కాంట్రాక్టర్లు చేసిందే పని..

వారు చెప్పిందే వేధం

ఎవరి లోపం లేదంటున్న అధికారులు

కొన్ని చోట్ల ఇలా జరగడం

సహజమేనంటున్న ఈఈ

థర్డ్‌ పార్టీ నివేదిక బుట్టదాఖలు

కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా

పై ఫొటోలో కనిపిస్తున్నది తాండూరు – కొడంగల్‌ మార్గం యాలాల మండల పరిధిలోని బ్రిడ్జి. తొమ్మిదేళ్ల క్రితం నిర్మాణ పనులు చేపట్టారు. ఏడేళ్ల పాటు పనులు సాగాయి. 2022 చివరి నాటికి బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యింది. ఇందుకోసం రూ.16.80 కోట్లు వెచ్చించారు. రెండేళ్లుగా వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. కొన్ని మాసాల క్రితం బ్రిడ్జికి రంద్రం పడింది. వందేళ్లపాటు ఉండాల్సిన వంతెన రెండేళ్లకే దెబ్బతినడం చూస్తే నాణ్యత ఏమేరకు పాటించారో ఇట్టే అర్థం అవుతుంది. దెబ్బతిన్న వంతెనను పరిశీలించి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

కాగ్నాపై రూ.16.80 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం

ప్రారంభించిన రెండేళ్లకే కుంగిన వైనం

గాజీపూర్‌ – బుద్దారం వాగుపై రూ.3.30 కోట్లతో వంతెన

ఏడాదిన్నరకే పాడైన బ్రిడ్జి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement