డివైడర్ పైకి దూసుకెళ్లిన లారీ
తాండూరు టౌన్: పట్టణంలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన లారీ డివైడర్ పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బుధవారం తెల్లవారుజామున పట్టణంలో చోటుచేసుకుంది. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. నాపరాయి లోడ్‌తో కొడంగల్ మార్గం నుంచి పట్టణంలోకి ఫ్లై ఓవర్ మీదుగా వచ్చిన లారీ, అతి వేగంగా బస్టాండు ఎదురుగా ఉన్న డివైడర్‌ను ఢీకొట్టింది. నిద్రమత్తులో ప్రమాదం జరిగిందా లేదా అతి వేగం వల్ల జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెల్లవారుజామున కావడంతో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది.


