కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం
● రెండేళ్లలో తాండూరుకు రూ.100 కోట్లు తెచ్చాం
● ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి
తాండూరు: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే తాండూరు పట్టణ ప్రజలు మనశ్శాంతిగా జీవిస్తున్నారని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అన్నారు. శనివారం పట్టణ పరిధిలోని 8వ వార్డు రాజీవ్ కాలనీ, ఇందిరమ్మ కాలనీల్లో పర్యటించి సాయప్పను గెలిపించాలని ప్రజలను కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యే అయిన రెండేళ్లలో తాండూరు మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.100 కోట్లు తెచ్చినట్లు తెలిపారు. పాత తాండూరులో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రారంభించామని గుర్తు చేశారు. పేదల సొంతింటి కలను నిజం చేస్తున్నట్లు చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని నిధులు తెచ్చి మున్సిపాలిటీని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ వెంకన్న గౌడ్, నాయకులు ముజీబ్ ఖాన్, అబ్దుల్ రవూఫ్ తదితరులు పాల్గొన్నారు.


