తాండూరుకు మహర్దశ మున్సిపాలిటీలను ఆదర్శవంతంగా తీర్చిదిద్
తాండూరు: మున్సిపల్ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలని ఎలక్షన్ అబ్జర్వర్ రవి అధికారులను ఆదేశించారు. శనివారం తాండూరు పట్టణంలోని స్ట్రాంగ్ రూమ్‌ను పరిశీలించారు. ఎన్నికల అధికారులకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ సుధీర్, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్‌తో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మధుసూదన్‌రెడ్డి, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
తాండూరు: మున్సిపల్ ఎన్నికల విధుల్లో పాల్గొననున్ను ప్రభుత్వ ఉద్యోగులు శనివారం పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారు. ఈ నెల 6న 10 మంది, శనివారం మరో 38 మంది ఓటు వేశారు. ఇందులో మహిళా ఉద్యోగులు 14 మంది, పురుష ఉద్యోగులు 34 మంది ఉన్నారు.
మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి
శంకర్‌పల్లి: రాష్ట్ర విభజన తర్వాత అస్తవ్యస్తంగా మారిన రాష్ట్రాన్ని.. సొంత ఇళ్లులా చక్కబెట్టిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని మాజీమంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి కొనియాడారు. మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో శనివారం బీఆర్‌ఎస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రెండేళ్లుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి చేసిందేమీలేదని, పొద్దున లేచినప్పటి నుంచి కేసీఆర్‌ని తిట్టడం, ఆయన జపం చేయడం తప్ప అని ఎద్దేవా చేశారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మళ్లీ కేసీఆర్ సర్కారే రావాలని, ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేసి, బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ శశిధర్‌రెడ్డి, ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తాండూరుకు మహర్దశ మున్సిపాలిటీలను ఆదర్శవంతంగా తీర్చిదిద్


