మహిళ ఆత్మహత్యాయత్నం
దాయాదుల దాడికి
భయపడేనని ఫిర్యాదు
ధారూరు: దాయాదుల దాడికి భయపడి ఓ మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించింది. స్పృహ కోల్పోయిన ఆమెను కుటుంబ సభ్యులు వికారాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం చికిత్స పొందుతోంది. ఈ ఘటన మండల పరిధిలోని శేరిగడ్డతండాలో శుక్రవారం చోటుచేసుకోగా శనివారం ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. తండాకు చెందిన లోక్యానాయక్, పాండునాయక్ దాయాదులు. వీరి మధ్య ఇంటి స్థలం, వ్యవసాయ పొలాలకు సంబంధించిన గొడవలు కొనసాగుతున్నాయి. ఈక్రమంలో శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఒంటరిగా ఉన్న తన భార్య రేణుకపై దాయాది పాండునాయతో పాటు అతని తల్లి రుక్కిబాయి, భార్య బుజ్జిబాయి, చెల్లెలు బుజ్జిబాయి కలిసి దాచేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. మూకుమ్మడి దాడితో హడలిపోయిన తన భార్య తీవ్ర మనస్తాపంతో పురుగుల మందు తాగిందని ఫిర్యాదు ఇచ్చారు.
మెట్లకుంటలో అగ్నిప్రమాదం
బొంరాస్‌పేట: మండల పరిధిలోని మెట్లకుంటలో శనివారం రాత్రి చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో ఓ మహిళ తీవ్ర గాయాలపాలైంది. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన ఈడ్గి ఆలమ్మ వాటర్ ట్యాంకు వద్ద హోటల్ పెట్టుకుని జీవనం సాగిస్తోంది. హోటల్‌లో టీ చేస్తుండగా.. పొయ్యిలోని నిప్పు రవ్వలు ఎగిసి పడి మంటలు అంటుకున్నాయి. దీంతో కట్టె లు, గడ్డితో నిర్మించిన హోటల్ అగ్నికి ఆహుతైంది. గాయపడిన ఆలమ్మను గాంధీ ఆస్పత్రికి తరలించారు. సర్పంచు ఉమాదేవి, నాయకులు నర్సింలునాయుడు, హాజీమలంగ్‌బాబా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితురాలికి మెరువైద్యం అందేలా చూస్తామన్నారు.
ఒగ్గు కథ కళాకారిణి మృతి
యాచారం: ప్రముఖ ఒగ్గు కథ కళాకారిణి జమ్మ మల్లారి(85) శనివారం మృతి చెందారు. మండల పరిధిలోని నక్కర్తమేడిపల్లికి చెందిన ఆమె ఒగ్గు కథలపై మక్కువ పెంచుకుంది. ఆమె ఉమ్మడి రాష్ట్రంలో గొల్ల, కురుమల కుటుంబాల్లో శుభాకార్యాలు నిర్వహించేవారు. ఆమె మృతికి సంతాపంగా గొల్ల, కురుమ సంఘాల పెద్దలు నివాళి అర్పించారు.
తల్లీకుమారుడు అదృశ్యం
కడ్తాల్: మహిళ అదృశ్యమైన ఘటన మండల కేంద్రంలో ఆలస్యంగా వెలుగులోకివచ్చింది. సీఐ గంగాధర్ తెలిపిన ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ఎర్రోళ్ల సరస్వతి బాలరాజు దంపతులు వ్యవసాయ కూలీలు. వీరికి రెండేళ్ల కుమారుడు శ్రీచరణ్ ఉన్నాడు. నెల రోజుల క్రితం సరస్వతి తన కుమారుడిని తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో ఆందోళనకు గురైన బాలరాజు సాధ్యమైన అన్ని ప్రాంతాల్లో వెతికాడు. ఎక్కడ ఆచూకీ లభించకపోవడంతో శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది. కాగా బాలరాజు మొదటి భార్య చనిపోయిన తర్వాత సరస్వతిని రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్యకు ముగ్గురు కుమారులు సంతానం.
మహిళ ఆత్మహత్యాయత్నం
మహిళ ఆత్మహత్యాయత్నం
మహిళ ఆత్మహత్యాయత్నం


