ఆదరించండి.. అభివృద్ధి చేస్తాం
● హామీలతో ఆకట్టుకున్న నాయకులు
ప్రజాసంక్షేమమే లక్ష్యం
కొడంగల్: ప్రజాసంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మున్సిపాలిటీ మాజీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ ఒకటో వార్డు అభ్యర్థి జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి 1,9వ వార్డుల్లో ఇంటింటి ప్రచారం చేశారు. అధికార పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, చేయి గుర్తుకు ఓటువేసి, తనతో పాటు.. 9వ వార్డు అభ్యర్థి గంట మంజులను గెలిపించాలని కోరారు.
పోటాపోటీగా ఎన్నికల ప్రచారం ● అభ్యర్థుల తరఫున నేతల పరుగు
పురపోరు నేపథ్యంలో జిల్లాలో రాజకీయ హడావుడి నెలకొంది. ప్రచార, పోలింగ్ సమయం సమీపిస్తుండటంతో కౌన్సిలర్ అభ్యర్థుల ప్రచారం జోరందుకుంది. అభ్యర్థులకు మద్దతుగా కుటుంబీకులు, బంధుజనం, ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగారు. ఇంటింటికి తిరుగుతూ హామీలు గుప్పిస్తున్నారు. ఆదరించండి.. వార్డులను అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తామని అభ్యర్థిస్తున్నారు.
–సాక్షి, నెట్‌వర్క్
అవ్వా.. నీ ఓటు నాకే
అనంతగిరి: ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ, సేవ చేస్తాను. ఆదరించండి అని కాంగ్రెస్ పార్టీ 10వ వార్డు అభ్యర్థి సుధాకర్‌రెడ్డి అన్నారు. ఎన్నికల నేపథ్యంలో శనివారం ఆయన పార్టీ శ్రేణులతో కలసి ఇంటింటి ప్రచారం చేశారు. అభివృద్ధి అధికార పార్టీతో సాధ్యమని, చేతి గుర్తుకు ఓటేసి గెలిపిస్తే.. వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.
కరపత్రం ఇచ్చి.. ‘కారు’కు ఓటేయని
తాండూరు టౌన్: ప్రజా సమస్యలు మాకు తెలుసు. కౌన్సిలర్ అభ్యర్థులను ఆదరించండి. వార్డులను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సతీమణి ఆర్తిరెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆమె శనివారం బీఆర్‌ఎస్ చైర్మన్ అభ్యర్థి పట్లోళ్ల నర్సింహులు, పట్లోళ్ల దీపకు మద్దతుగా 9, 10 వార్డుల్లో ఇంటింటి ప్రచారం చేశారు. ఎమ్మెల్యేగా రోహిత్ చేసిన అభివృద్ధి పనుల గురించి వివరించారు. కారు గుర్తుకు ఓటు వేసి, బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరారు.
అనంతగిరి: అధికార పార్టీ కాంగ్రెస్‌తోనే అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని ఆ పార్టీ 22వ ఆలంపల్లి వార్డు అభ్యర్థి లంకా లక్ష్మీకాంత్‌రెడ్డి అన్నారు. ఎన్నికల నేపథ్యంలో శనివారం ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి ఇంటింటి ప్రచారం చేశారు. అందుబాటులో ఉండి, వార్డును అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని చెప్పారు. చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
ప్రచారం చేస్తున్న లక్ష్మీకాంత్‌రెడ్డి తదితరులు
ఆదరించండి.. అభివృద్ధి చేస్తాం
ఆదరించండి.. అభివృద్ధి చేస్తాం
ఆదరించండి.. అభివృద్ధి చేస్తాం
ఆదరించండి.. అభివృద్ధి చేస్తాం
ఆదరించండి.. అభివృద్ధి చేస్తాం


