మహిళా సాధికారతే లక్ష్యం
● ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
● మహిళా సంఘాలకు రూ.567 కోట్ల చెక్కు అందజేత
పరిగి: మహిళా సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. జిల్లాలోని 6,650 మహిళా స్వయం సహయక సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా రూ.567.69 కోట్ల చెక్కును అందజేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న ప్రతీ పథకంలో మహిళలను భాగస్వామ్యం చేసిందన్నారు. రాష్ట్రంలోని మహిళా సంఘాలకు వెయ్యి బస్సులను అందించామని వీటిద్వారా ప్రతినెలా ఒక్కో బస్సుపై రూ.70 వేల ఆదాయం వస్తోందని సీఎం తెలిపారు. గత ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరలను ఒక్క మహిళ కూడా కట్టిన పాపన పోలేదన్నారు. కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన ఇందిరమ్మ చీరలు ఎంతో బాగున్నాయని తెలిపారు.
సీఎం రేవంత్‌రెడ్డికి టీఆర్‌ఆర్ వినతి
జోగులాంబ జోన్‌లోని గండీడ్, మహ్మదాబాద్ మండలాలను వికారాబాద్ జిల్లాలో కలపాలని స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి శనివారం నిర్వహించిన సభలో సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. కేపీలక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు డీపీఆర్ పూర్తయిన నేపథ్యంలో భూసేకరణ చేసి త్వరగా పనులను ప్రారంభించాలన్నారు. ఈ ప్రాంతానికి సాగు నీరు ఇవ్వాలని కోరారు. ప్రాజెక్టు పూర్తయితే నియోజవకర్గంలోని 500 చెరువులకు నీరందించవచ్చన్నారు. సీఎం కృషితోనే మన్నెగూడ, అప్పా జంక్షన్ నాలుగు లేన్ల రోడ్డు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఏడాది తిరిగే లోపు పరిగి రూపురేఖలు మారుతాయని ధీమా వ్యక్తంచేశారు.
మహిళా సాధికారతే లక్ష్యం


