మృతదేహంతో ఆందోళన | - | Sakshi
Sakshi News home page

మృతదేహంతో ఆందోళన

Feb 15 2026 12:39 PM | Updated on Feb 15 2026 12:39 PM

మృతదే

మృతదేహంతో ఆందోళన

హయత్‌నగర్‌: హయత్‌నగర్‌లోని నార్ముల్‌ మదర్‌ డెయిరీ వద్ద శనివారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. డెయిరీలోని ప్రీప్యాక్‌ సెక్షన్‌లో విధులు నిర్వహిస్తున్న పసుమాములకు చెందిన తులసిగారి బాల్‌నర్సింహ(45) శుక్రవారం ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. తోటి కార్మికులు అతన్ని ఎల్బీనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడినుంచి ఉస్మానియాకు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. యాజమాన్యం నెలల తరబడి జీతాలు చెల్లించకపోవడంతో మానసికఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేకే బాల్‌నర్సింహ మృతిచెందా డని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు శనివారం డెయిరీ గేటు ఎదుట మృతదేహంతో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బాల్‌నర్సింహ ముప్పైఏళ్లుగా డెయిరీలో పనిచేస్తున్నాడని, మూడు నెలలుగా వేతనాలు అందకపోవడంతో తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడని, ఈ క్రమంలో మెదడు నరాలు చిట్లిపోయి మృతి చెందాడని రోదించారు. ఆయన మృతికి పాలక మండలి బాధ్యత వహించాలని డిమాండ్‌ చేస్తూ డెయిరీలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు తోపులాట జరిగి, ఉద్రిక్తతకు దారితీసింది. నిరసనకారులతో ఫోన్‌లో మాట్లాడిన చైర్మన్‌ మధుసూదన్‌రెడ్డి తక్షణ సాయంగా రూ.50 అందజేస్తామని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని మామీ ఇచ్చారు. పరిహారం విషయాన్ని బోర్డు సమావేశంలో నిర్ణయిస్తామని చెప్పడంతో నిరసకారులు శాంతించారు.

కార్మికుడి మరణంతో మదర్‌ డెయిరీ వద్ద ఉద్రిక్తత

ఆర్థిక, మానసిక ఒత్తిడే కారణమని కుటుంబ సభ్యుల ఆందోళన

పోలీసులు, నిరసనకారుల మధ్య తోపులాట

చైర్మన్‌ హామీతో సద్దుమనిగిన వివాదం

మృతదేహంతో ఆందోళన1
1/1

మృతదేహంతో ఆందోళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement