ప్రచారం కై ్లమాక్స్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రచారం కై ్లమాక్స్‌

Feb 9 2026 8:55 AM | Updated on Feb 9 2026 8:55 AM

ప్రచా

ప్రచారం కై ్లమాక్స్‌

గెలుపుపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ ఫోకస్‌

వికారాబాద్‌: ప్రచారం ముగింపునకు ఇంకా ఒక్కరోజు మాత్రమే సమయం ఉండడంతో స్టార్‌ క్యాంపెయినర్ల దృష్టి వికారాబాద్‌ జిల్లాపై పడింది. పోలింగ్‌ తేది దగ్గర పడుతుండడంతో ఆయా పార్టీల అగ్రనేతలు రంగంలో దిగుతున్నారు. జిల్లాలోని నియోజకవర్గాలలో ప్రధానంగా కాంగ్రెస్‌–బీఆర్‌ఎస్‌ మధ్యే పోటీ ఉంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని సర్వశక్తులు ఒడ్డుతున్న కాంగ్రెస్‌ అధికార పార్టీని ఎలాగైనా సరే ఓడించాలని పట్టుదలతో ఉన్న బీఆర్‌ఎస్‌ తరఫున ముఖ్యనేతలు రంగంలోకి దిగటంతో ప్రచారం తారాస్థాయికి చేరింది. మున్సిపాలిటీల్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ పార్టీల అభ్యర్థుల తరఫున ఆయా పార్టీల అధినేతలతో పాటుగా స్టార్‌ క్యాంపెయినర్లను రంగంలోకి దించుతున్నారు. ప్రచారానికి కౌండౌన్‌ మొదలడవడంతో అధినేతలతో సుడిగాలి పర్యటనలు చేయిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌ తరఫున ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ప్రతిపక్షం నుంచి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ జిల్లాలో పర్యటించారు. కాంగ్రెస్‌ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా జిల్లాలో పార్టీ ముఖ్యులను రంగంలోని దించుతున్నారు. బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ముఖ్యనేతలు రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు.

నేటీతో అంతా గప్‌చుప్‌

మున్సిపాలిటీల ఎన్నికలకు ప్రచారం సోమవారం సాయంత్రంతో పరిసమాప్తం కానుంది. వారం పది రోజులుగా హోరెత్తిన మైకులు మూగబోనున్నాయి. ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం పోలింగ్‌కు 48 గంటల ముందే ప్రచారం ముగించాల్సి ఉండడంతో సోమవారం సాయంత్రం 5 గంటల వరకు ప్రచారం చేసుకోవచ్చు. ఆ తరువాత ఏపార్టీ ప్రచారం చేసుకునే వీలుండదు.

జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. నాలుగు మున్సిపాలిటీల్లో మూడు పార్టీల అభ్యర్థుల తరఫున అగ్రనేతలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. నేటి సాయంత్రంతో ప్రచార పర్వం ముగియనుంది.

మాజీ మంత్రులు కేటీఆర్‌, సబితారెడ్డి రోడ్‌షోలతో కారులో హుషారు

మహారాష్ట్ర మంత్రులు, కొండాతో ప్రచారం చేయించిన కమలనాథులు

పోటాపోటీగా ప్రచార సభలు, కార్నర్‌ మీటింగ్‌లు

ముఖ్యమంత్రి సభతో హస్తం శ్రేణుల్లో జోష్‌

ప్రచారం కై ్లమాక్స్‌1
1/1

ప్రచారం కై ్లమాక్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement