‘గుర్తు’ంచుకొని.. ఓటు వేయమని | - | Sakshi
Sakshi News home page

‘గుర్తు’ంచుకొని.. ఓటు వేయమని

Feb 9 2026 8:56 AM | Updated on Feb 9 2026 8:56 AM

‘గుర్

‘గుర్తు’ంచుకొని.. ఓటు వేయమని

అభివృద్ధి మాతోనే సాధ్యం. మున్సిపాలిటీలో అన్ని వార్డులను కై వసం చేసుకుంటామని అధికార, ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్‌ అభ్యర్థులు, ఆయా రాజకీయ పార్టీ నేతలు దీమా వ్యక్తం చేస్తున్నారు. పురపాలక సంఘం ఎన్నికల నేపథ్యంలో ఆదివారం కాంగ్రెస్‌ 10వ వార్డు అభ్యర్థి సుధాకర్‌రెడ్డి, అదే పార్టీ 18వ వార్డు అభ్యర్థి చిగుల్లపల్లి రమేష్‌కుమార్‌, బీఆర్‌ఎస్‌ 7వ వార్డు అభ్యర్థి అనంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ 22వ వార్డు అభ్యర్థి లక్ష్మీకాంత్‌రెడ్డి, అదే పార్టీ 25వ వార్డు అభ్యర్థి వినోద్‌కు మద్దతుగా ఏఎంసీ చైర్మన్‌ శ్రీనివాస్‌ ముదిరాజు ఇంటింటి ప్రచారం చేశారు. ప్రజలు తమ పాలనే కోరుకుంటున్నారని, మర్చిపోకుండా చేతి, కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. – అనంతగిరి

ప్రచారం చేస్తున్న అభ్యర్థులు సుధాకర్‌రెడ్డి(కాంగ్రెస్‌), చిగుల్లపల్లి రమేష్‌కుమార్‌(కాంగ్రెస్‌), అనంత్‌రెడ్డి(బీఆర్‌ఎస్‌), లక్ష్మీకాంత్‌రెడ్డి(కాంగ్రెస్‌), వినోద్‌(కాంగ్రెస్‌)కు మద్దతుగా.. ఏఎంసీ చైర్మన్‌ శ్రీనివాస్‌ ముదిరాజు తదితరులు

అభివృద్ధి మాతోనే..

అన్ని వార్డులు మావే

కాంగ్రెస్‌ గెలుపు ఖాయం

కొడంగల్‌: అధికార పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయమని ఆ పార్టీ 7వ వార్డు అభ్యర్థి కృష్ణంరాజు అన్నారు. ఆదివారం ఆయన పార్టీ శ్రేణులతో కలసి మున్సిపల్‌ పరిధి బూల్కాపూర్‌, ఐనన్‌పల్లి గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డి సహకారంతో వార్డును అభివృద్ధి చేస్తానని, చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

పోటాపోటీగా అభ్యర్థుల ప్రచారం మద్దతుగా సర్వశక్తులు ఒడ్డుతున్న పార్టీలు

గెలుపే లక్ష్యంగా ప్రచారబాట నేటితో పరి సమాప్తం

పురపాలిక ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. పోలింగ్‌కు మరో రెండు రోజులే గడువు ఉండటంతో నాలుగు మున్సిపాలిటీల్లో హడావుడి నెలకొంది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు తమ అభ్యర్థుల తరఫున వాడవాడన పర్యటిస్తున్నారు. రెండుపూటలా ఇంటింటికి వెళ్లి ‘గుర్తు’ంచుకొని, అభిృద్ధిని చూసి ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ప్రజాదరణను చూసి ఓర్వలేక అసత్య ప్రచారం చేస్తున్నారని, వారి మాటలు నమ్మవద్దని ఇరు పార్టీల నేతలు కోరుతున్నారు. నేటితో ప్రచారం ముగియనుంది. – సాక్షి, నెట్‌వర్క్‌

అధికార పార్టీతోనే అభివృద్ధి

కొడంగల్‌: ప్రజాసంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని, అధికార పార్టీతోనే పట్టణం అభివృద్ధి చెందుతుందని కాంగ్రెస్‌ పార్టీ చైర్మన్‌ అభ్యర్థినందారం ప్రశాంత్‌ అన్నారు. ఆదివారం ఆయన పార్టీ శ్రేణులతో కలసి గుండ్లకుంట, పాత కొడంగల్‌లో ఇంటింటి ప్రచారం చేశారు. మర్చిపోకుండా చేతి గుర్తుకు ఓటు వేసి, అభివృద్ధిని ఆస్వాదించాలని ఓటర్లను అభ్యర్థించారు.

మోసం చేస్తున్న కాంగ్రెస్‌

పరిగి: మాయమాటలతో అధికారం చేపట్టి, మోసం చేస్తున్న కాంగ్రెస్‌ను ఓటుతో బుద్ధిచెప్పాలని మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి సతీమణి కొప్పుల ప్రతిమారెడ్డి అన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఆదివారం బీఆర్‌ఎస్‌ పార్టీ పట్టణ కేంద్రంలోని 4వ వార్డు అభ్యర్థి శివానోళ్ల చంద్రకళ తరుఫున ఇంటింటి ప్రచారం చేశారు. రెండెళ్లలో ప్రభుత్వం చేసిందేమీ లేదని ఆరోపించారు. ప్రజలు కేసీఆర్‌ పాలనను కోరుకుంటున్నారని, కారు గుర్తుకు ఓటువేసి, పార్టీ అభ్యర్థులకు గెలిపించాలని కోరారు.

ఆప్యాయత మీది..

సంక్షేమం నాది

తాండూరు టౌన్‌: నమ్మకంతో గెలిపిస్తే వార్డును అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్‌ పార్టీ 36వ వార్డు అభ్యర్థి కల్వ సిరిచందన అన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఆదివారం ఆమె పార్టీ శ్రేణులతో కలసి ఇంటింటి ప్రచారం చేశారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలన అస్తవ్యస్తంగా కొనసాగిందన్నారు. అధికార పార్టీ హస్తం గుర్తుకు ఓటేసి, అభివృద్ధిని ఆస్వాదించాలని కోరారు.

‘గుర్తు’ంచుకొని.. ఓటు వేయమని 1
1/10

‘గుర్తు’ంచుకొని.. ఓటు వేయమని

‘గుర్తు’ంచుకొని.. ఓటు వేయమని 2
2/10

‘గుర్తు’ంచుకొని.. ఓటు వేయమని

‘గుర్తు’ంచుకొని.. ఓటు వేయమని 3
3/10

‘గుర్తు’ంచుకొని.. ఓటు వేయమని

‘గుర్తు’ంచుకొని.. ఓటు వేయమని 4
4/10

‘గుర్తు’ంచుకొని.. ఓటు వేయమని

‘గుర్తు’ంచుకొని.. ఓటు వేయమని 5
5/10

‘గుర్తు’ంచుకొని.. ఓటు వేయమని

‘గుర్తు’ంచుకొని.. ఓటు వేయమని 6
6/10

‘గుర్తు’ంచుకొని.. ఓటు వేయమని

‘గుర్తు’ంచుకొని.. ఓటు వేయమని 7
7/10

‘గుర్తు’ంచుకొని.. ఓటు వేయమని

‘గుర్తు’ంచుకొని.. ఓటు వేయమని 8
8/10

‘గుర్తు’ంచుకొని.. ఓటు వేయమని

‘గుర్తు’ంచుకొని.. ఓటు వేయమని 9
9/10

‘గుర్తు’ంచుకొని.. ఓటు వేయమని

‘గుర్తు’ంచుకొని.. ఓటు వేయమని 10
10/10

‘గుర్తు’ంచుకొని.. ఓటు వేయమని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement