ఉచిత వైద్య శిబిరం
షాద్‌నగర్‌రూరల్: ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని బుచ్చిగూడలో మాజీ ఎంపీ శేషయ్య వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం కమ్మ సమైక్య వేదిక అధ్యక్షుడు సాంబశివరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్యశిబిరం విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా మాజీ ఎంపీ శేషయ్యనగర్ కమ్యూనిటీ హాలులో నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలోని వివ ఆస్పత్రి వైద్యులతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్యశిబిరంలో 150 మందికి ఉచితంగా వైద్య పరీక్షలను నిర్వహించి, మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ మల్లేశ్‌గౌడ్, ఉపసర్పంచ్ మహేశ్‌యాదవ్, నాయకులు పాల్గొన్నారు.


