పరిగి ప్రగతిని పరుగులు పెట్టిస్తా
పరిగి: ‘రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం’ అని ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి దీమా వ్యక్తం చేశారు. ఆదివారం పార్టీ 8వ వార్డుఅభ్యర్థి హబీబ్ ఉన్నిసా తరఫున ఆయన ఇంటింటి ప్రచారం చేశారు. పరిగిని అన్నివిధాలాఅభివృద్ధి చేస్తానని చెప్పారు. బీఆర్‌ఎస్ పార్టీకి జరిగిన అన్ని ఎన్నికల్లో తమ ఓటుతో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని, ఇప్పుడూ అవే ఫలితాలు పునరావృతం అవుతాయని జోస్యం చెప్పారు. ప్రతిపక్ష నేతల తప్పుడు ప్రచారం నమ్మవద్దని, అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి, గెలిపించాలని కోరారు. డీసీసీ ఉపాధ్యక్షుడు లాల్‌కృష్ణ ఉన్నారు.


