అభివృద్ధికి పట్టం కట్టండి | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధికి పట్టం కట్టండి

Feb 10 2026 9:50 AM | Updated on Feb 10 2026 9:50 AM

అభివృద్ధికి పట్టం కట్టండి

అభివృద్ధికి పట్టం కట్టండి

● స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ ● వికారాబాద్‌లో ఇంటింటి ప్రచారం

అనంతగిరి: మున్సిపల్‌ ఎన్నికల్లో వికారాబాద్‌ పట్టణ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టాలని స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ కోరారు. సోమవారం మున్సిపల్‌ పరిధిలోని పలు వార్డుల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల తరఫున ఇంటింటి ప్రచారం, రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ వార్డుకు వెళ్లినా ప్రజలు ఆదరిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఉన్నందున ఇక్కడ కూడా మన వారే ఉంటే త్వరితగతిన అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుదన్నారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని, మీ ఓటును వృథా చేసుకోవద్దని సూచించారు. ఇప్పటికే వికారాబాద్‌ అభివృద్ధికి కోట్ల రూపాయలు మంజూరైనట్లు తెలిపారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్‌, తాగునీటి పనులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. అనంతగిరి గుట్టను టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమానంగా తీసుకుని ముందుకు సాగుతామని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమపథకాలు అందజేస్తామన్నారు. నా బిడ్డ అనన్యను ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు, మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement