నేడే పోలింగ్‌ | - | Sakshi
Sakshi News home page

నేడే పోలింగ్‌

Feb 11 2026 8:51 AM | Updated on Feb 11 2026 8:51 AM

నేడే

నేడే పోలింగ్‌

ఎన్నికల సామగ్రితో కేంద్రాలకు సిబ్బంది జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు పోలింగ్‌ కేంద్రాలు 261 ఓటర్లు 1,74,529 సమస్యాత్మక కేంద్రాలు 53, అతిసామస్యాత్మక కేంద్రాలు 74 భారీ బందోస్తు ఏర్పాట్లు

మున్సిపల్‌ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

వికారాబాద్‌: మున్సిపల్‌ పోలింగ్‌కు కొన్ని గంటల సమయమే మిగిలింది. నేటి(బుధవారం) ఉదయం 7గంటల నుంచి పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్ల నుంచి ఎన్నికల సామగ్రితో కేటాయించిన కేంద్రాలకు సిబ్బంది తరలివెళ్లారు. వికారాబాద్‌ పట్టణంలోని మేరీ – ఏ నాట్స్‌ పాఠశాల, తాండూరులో సెయింట్‌ మార్క్స్‌ హైస్కూల్‌, పరిగిలో మినీ స్టేడియం, కొడంగల్‌లో జూనియర్‌ కళాశాల మైదానం నుంచి సిబ్బంది వాహనాల్లో పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లారు. కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌, అడిషనల్‌ కలెక్టర్లు రాజేశ్వరి, సుధీర్‌, ఇతర ఉన్నతాధికారులు ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. పోలింగ్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. 53 సమస్యాత్మక, 74 అతి సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి వెబ్‌కాస్టింగ్‌, మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. దివ్యాంగ ఓటర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వారిని పోలింగ్‌ కేంద్రాల వద్దకు తీసుకురావడానికి ట్రై సైకిళ్లు, వీల్‌ చైర్లను సిద్ధంగా ఉంచారు. ప్రతి సెంటర్‌లో వలంటీర్లను నియమించారు. 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది.

నాలుగు మున్సిపాలిటీలు.. వంద వార్డులు

ఎజిల్లాలో వికారాబాద్‌, తాండూరు, పరిగి, కొడంగల్‌ పురపాలికలు ఉన్నాయి. వీటి పరిధిలో 100 వార్డులు ఉండగా 1,74,529 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందు కోసం 261 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 58 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. మరో 8 ఎస్‌ఎస్‌టీ టీంలు, 8 ఎఫ్‌ఎస్‌టీ టీంలతో పర్యవేక్షించనున్నారు. 313 మంది పీఓలు, 313 ఏపీఓలు, 940 మంది ఓపీఓలు విధుల్లో పాల్గొననున్నారు.

సర్వం సిద్ధం

పరిగి: మున్సిపల్‌ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పరిగి పురపాలిక వద్ద ఎన్నికల సిబ్బందికి పోలింగ్‌ సామగ్రి అందజేశారు. పట్టణ పరిధిలో 18 వార్డులు, 27,600 మంది ఓటర్ల ఉన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ, సీపీఎం, స్వతంత్రులతో కలిసి 60 మంది బరిలో ఉన్నారు. 38 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు కమిషనర్‌ వెంకటయ్య తెలిపారు. 45 మంది ప్రిసైడింగ్‌ అధికారులు, 46 మంది ఏపీఓలు, 157 మంది ఓపీఎస్‌లు విధులు నిర్వహించనున్నారు. ఏడుగురు మైక్రో అబ్జర్వర్లు, మరో ఏడుగురు జోనల్‌ అధికారులు. 5 రూట్‌లలో పనిచేయనున్నారు. 158 మంది పోలీసులు, అధికారులు విధుల్లో ఉంటారు. ఆర్టీఓ వాసుచంద్ర ఎన్నికల అధికారులకు పలు సూచనలు చేశారు.

పోలింగ్‌ కేంద్రాలకు సిబ్బంది

తాండూరు టౌన్‌: మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్‌ సామగ్రితో సిబ్బంది కేంద్రాలకు తరలివెళ్లారు. పట్టణంలోని సెయింట్‌ మార్క్స్‌ జూబ్లీ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ నుంచి ఎన్నికల సిబ్బంది విధులకు వెళ్లారు. పట్టణంలోని 36 వార్డులకు గాను 117 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 585 మంది సిబ్బంది విధులు నిర్వర్తించనున్నట్లు డీఆర్‌ఓ మంగీలాల్‌ తెలిపారు. వీరితో పాటు అదనంగా మరో 20 శాతం మందిని సిద్ధం చేసినట్లు చెప్పారు. 9 రూట్లలో ఏర్పాటు చేసిన వాహనాల్లో సిబ్బంది ఆయా పోలింగ్‌ కేంద్రాలకు పంపినట్లు తెలిపారు. పట్టణంలోని 13 సమస్యాత్మక ప్రాంతాలతో పాటు అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

పొరపాట్లకు అవకాశం ఇవ్వొద్దు

మున్సిపల్‌ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా సిబ్బంది చూసుకోవాలని కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ అన్నారు. మంగళవారం తాండూరు పట్టణంలోని డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ను పరిశీలించారు. పోలింగ్‌ సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ మంగీలాల్‌, మున్సిపల్‌ కమిషనర్‌ మధుసూదన్‌రెడ్డి, తహసీల్దార్‌ తారాసింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

మున్సిపాలిటీల వారీగా వార్డులు.. ఓటర్లు

మున్సిపల్‌ వార్డులు పురుషులు సీ్త్రలు మొత్తం ఓటర్లు

వికారాబాద్‌ 34 28,751 29,339 58,117

తాండూరు 36 37,547 39,558 77,110

పరిగి 18 13,822 13,792 27,614

కొడంగల్‌ 12 5,661 6,007 11,688

నేడే పోలింగ్‌1
1/3

నేడే పోలింగ్‌

నేడే పోలింగ్‌2
2/3

నేడే పోలింగ్‌

నేడే పోలింగ్‌3
3/3

నేడే పోలింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement