ఉత్సాహంగా సీఎం కప్ పోటీలు
హుడాకాంప్లెక్స్: జిల్లా స్థాయి సీఎం కప్–2026 క్రీడా పోటీలు మంగళవారం సరూర్‌నగర్ స్టేడియంలో ఉత్సాహంగా కొనసాగాయి. వాలీబాట్, బాక్సింగ్ పోటీల్లో సుమారు 500 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వాలీబాల్ బాలుర విభాగంలో కల్వకుర్తి టీం విజేతగా, షాద్‌నగర్ టీం రన్నర్‌గా నిలిచింది. బాలికల విభాగంలో కల్వకుర్తి టీం విజేతగా, ఇబ్రహీంపట్నం రన్నర్‌గా నిలిచాయి. విజేతలకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఎస్టేట్ ఆఫీసర్ పద్మావతి, జిల్లా క్రీడలశాఖ అధికారి వెంకటేశ్వర్‌రావు సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశారు. పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిచిన క్రీడాకారులు త్వరలో రాష్ట్రస్థాయిలో నిర్వహించనున్న పోటీల్లో పాల్గొననున్నారు.


