ఉరుకులు.. పరుగులు | - | Sakshi
Sakshi News home page

ఉరుకులు.. పరుగులు

Feb 11 2026 8:51 AM | Updated on Feb 11 2026 8:51 AM

ఉరుకులు.. పరుగులు

ఉరుకులు.. పరుగులు

● గాజులరామారంలో 3 సెకన్లు కంపించిన భూమి ● ఎలాంటి ప్రకంపనలు నమోదు కాలేదు: ఇన్‌కాయిస్‌ అధికారులు

సుభాష్‌నగర్‌: గాజులరామారంలోని మెట్‌కానిగూడ పరిసర ప్రాంతాలలో భూమి కంపించింది. మంగళవారం ఉదయం 10. 20 గంటల సమయంలో మెట్‌కానిగూడ, హెచ్‌ఏఎల్‌, ఓక్షిత్‌ ఎన్‌క్లేవ్‌, ఆదర్శనగర్‌ కాలనీలలో ఒక్కసారిగా భారీ శబ్దంతో భూమి కంపించడంతో అపార్ట్‌మెంట్లు, ఇళ్లలోని ప్రజలు బయటకు పరుగులు తీశారు. గేటెడ్‌ అపార్ట్‌మెంట్‌ వాసులు, స్థానికులు రోడ్డుపైకి వచ్చి గుంపులుగా చేరారు. భూమి కంపించడంతో స్థానిక పాఠశాలలకు యాజమాన్యాలుసెలవు ప్రకటించాయి. కొద్దిసేపటి దాకా ఇళ్లలోకి పోయేందుకు స్థానికులు భయపడ్డారు. ఘటన స్థలానికి చేరుకున్న సూరారం పోలీసులు భూకంపమా..? లేక ఇతర పేలుడు పదార్థాల కారణంగా వచ్చిన శబ్దమా? అనే కోణాల్లో విచారణ చేపట్టారు. చివరికి ఏ విషయమూ అంతు చిక్కలేదని సూరారం సీఐ సుధీర్‌కృష్ణ తెలిపారు. ప్రగతి నగర్‌లోని ఇన్‌కాయిస్‌ అధికారులకు సంప్రదించగా.. ఎలాంటి భూ ప్రకంపనలు నమోదు కాలేదని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement