అర్ధరాత్రి హైడ్రామా
గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థిని అప్పజెప్పాలని డిమాండ్ తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదన్న అక్కమ్మ పోలీసుల తీరుపై బీఆర్‌ఎస్ నాయకుల మండిపోటు
పరిగి: పరిగి మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. చైర్మన్ ఎన్నికకు గెలిచిన ఇద్దరు స్వతంత్రలు కీలకంగా మారారు. వారిలో ఒకరు కాంగ్రెస్ నాయకుల వద్ద.. మరొకరు బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి వద్ద ఉన్న విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో శుక్రవారం అర్ధరాత్రి మాజీ ఎమ్మెల్యే ఇంటికి పోలీసులు వెళ్లారు. ఒకటవ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన అక్కమ్మను తమతో పంపాలని కోరగా బీఆర్‌ఎస్ నాయకులు అభ్యంతరం చెప్పారు. దీంతో పోలీసులు, బీఆర్‌ఎస్ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గెలిచిన ఇద్దరూ బీఆర్‌ఎస్ రెబల్స్ అని ఆ పార్టీ నేతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టకొని మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవాలని చూస్తోందని ఆరోపించారు. ఇందుకు పోలీసులను వాడుకుంటున్నారని విమర్శించారు. ఇందులో భాగంగానే అక్కమ్మను తీసుకెళ్లాలని చూస్తున్నారని తెలిపారు.
పుర రాజకీయం రసవత్తరం
పరిగి మున్సిపల్ పరిధిలో మొత్తం 18 వార్డులు ఉండగా.. కాంగ్రెస్ పార్టీ 8 వార్డుల్లో, బీఆర్‌ఎస్ పార్టీ 8 చోట్ల, ఇద్దరు స్వతంత్రులు గెలిచారు. చైర్మన్ పదవి పొందాలంటే మ్యాజిక్ ఫిగర్ 10 ఉండాలి. కానీ ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. దీంతో గెలిచిన స్వతంత్రులు కీలకమయ్యారు.వారి కోసం ఇరు పార్టీ లు శత విధాలుగా ప్రయత్నాలు చేస్తు న్నాయి. ఇద్దరూ బీఆర్‌ఎస్ రెబల్స్ కావడంతో తమకే మద్దతు తెలుపుతారని ఆ పార్టీ నేతలు భావించారు. ఈ క్రమంలో మొదటి వార్డు నుంచి మొదటి రౌండ్‌లో విజయం సాధించిన అక్కమ్మను వారి వద్ద ఉంచుకున్నారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు అక్కమ్మ కుమారుడు బాల్‌రాజ్‌ను తీసుకెళ్లారు. తదనంతరం తన తల్లి కిడ్నాప్‌కు గురైందంటూ బాల్‌రాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. అక్కమ్మను తమతో పంపాలని కోరారు. ఇందుకు బీఆర్‌ఎస్ నేతలు ససేమిరా అన్నారు. చివరకు అక్కమ్మే వచ్చి తాను ఇక్కడ సురక్షితంగా ఉంటానని భావించి వచ్చినట్లు చెప్పడంతో పోలీసులు వెనుదిరగాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా చైర్మన్ పదవి చేజారి పోకూడదని భావించిన కాంగ్రెస్ నాయకులు మూడో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన హన్మంతును పోలీసుల సాయంతో తీసుకెళ్లారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్, పోలీసుల మధ్య తోపుపాట చోటుచేసుకుంది. ఉద్రిక్తల నడుమ పోలీసులు వారి వాహనాల్లో హన్మంతును తీసుకెళ్లారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నేతలు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గెలుపొందిన బీఆర్‌ఎస్ రెబల్స్‌తో మున్సిపల్ పీఠం దక్కించుకోవాలని చూస్తున్నారని, ఇలాంటి వాటిని ఎవరూ సహించరన్నారు.
మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి ఇంటికి పోలీసులు
అర్ధరాత్రి హైడ్రామా


