సర్పంచ్‌ సస్పెన్షన్‌ అన్యాయం | - | Sakshi
Sakshi News home page

సర్పంచ్‌ సస్పెన్షన్‌ అన్యాయం

Feb 13 2026 5:37 AM | Updated on Feb 13 2026 5:37 AM

సర్పంచ్‌ సస్పెన్షన్‌ అన్యాయం

సర్పంచ్‌ సస్పెన్షన్‌ అన్యాయం

సర్పంచ్‌ సస్పెన్షన్‌ అన్యాయం

కలెక్టర్‌ ఉత్తర్వులను ఉప సంహరించుకోవాలి

గిరిజన సంఘాల నేతల డిమాండ్‌

పంజగుట్ట: మోకిలతండా సర్పంచ్‌ శాంతమ్మను సస్పెండ్‌ చేయడం అన్యాయమని, కలెక్టర్‌ జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే ఉప సంహరించుకోవాలని భారతీయ గోర్‌ బంజారా పోరాట సమితి గౌరవాధ్యక్షుడు బానోతు మంగీలాల్‌ నాయక్‌ డిమాండ్‌ చేశారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడుతామని స్పష్టంచేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమితి రాష్ట్ర అధ్యక్షుడు రవిచందర్‌ చౌహాన్‌, తొలగింపునకు గురైన సర్పంచ్‌ శాంతాబాయితో కలిసి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 12వేల మంది సర్పంచ్‌లు ఉండగా ఎలాంటి కారణం లేకుండా ఒక గిరిజన మహిళా సర్పంచ్‌ను సస్పెండ్‌ చేయడం దుర్మార్గమని ఆగ్రహంవ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై న సర్పంచ్‌ను కేవలం పంచాయతీ పరిధిలో చెట్లను తొలగించారన్న కారణంతో పదవి నుంచి తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ విషయంపై గిరిజన మంత్రి సీతక్క, ముఖ్యమంత్రి స్పందించి వెంటనే సస్పెన్షన్‌ను ఉప సంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. శాంతమ్మ మాట్లాడుతూ.. తనపై కక్షగట్టి ఇలా చేశారన్నారు. తాను ఎంతో కష్టపడి ఇండిపెండెంట్‌గా గెలిచానని, సస్పెన్షన్‌ను రద్దు చేసి, న్యాయం చేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement