అల్లుడిని గెలిపించిన మామ ఆఫర్లు!
తాండూరు టౌన్: పట్టణంలోని 13వ వార్డులో బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసిన సురేశ్‌నాయక్ కౌన్సిలర్‌గా గెలుపొందారు. ఇతని మామ, తాండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్‌నాయక్ అల్లుడి విజయంలో కీలక పాత్ర పోషించారు. వార్డు నుంచి తలన అల్లుడిని గెలిపిస్తే తన వినాయక ఫంక్షన్‌హా ల్, వినాయక ఆస్పత్రి, వినాయక నర్సింగ్ కళాశాల లో 13వ వార్డు ప్రజలకు 50 శాతం రాయితీ ఇస్తాన ని ప్రకటించారు. అలాగే వినాయక కన్సల్టెన్సీ ద్వా రా నిరుద్యోగ యువతకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో ప్రాధాన్యతి ఇస్తానని హామీ ఇచ్చారు. పార్టీ అభిమానమో, విఠల్‌నాయక్ ఆఫర్లో తెలియదు కానీ మొత్తానికి సురేశ్ విజయం సాధించారు.


