ద్విచక్రవాహనం ఢీకొని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

ద్విచక్రవాహనం ఢీకొని వ్యక్తి మృతి

Feb 15 2026 12:39 PM | Updated on Feb 15 2026 12:39 PM

ద్విచక్రవాహనం ఢీకొని వ్యక్తి మృతి

ద్విచక్రవాహనం ఢీకొని వ్యక్తి మృతి

బొంరాస్‌పేట: రోడ్డు దాటుతుండగా ద్విచక్ర వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని రేగడిమైలారం జాతీయ రహదారిపై శనివారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. డీప్లానాయక్‌ తండాకు చెందిన మీసాల దేవ్లానాయక్‌(65) గ్రామంలోని ప్రధాన కూడలి వద్ద జాతీయ రహదారి దాటుతున్నారు. తుంకిమెట్ల వైపు నుంచి కొడంగల్‌ వైపు వేగంగా వెళ్త్న్ను ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దేవులానాయక్‌ తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయాడు. ఆయనున్న వికారాబాద్‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందాడు. ద్విచక్ర వాహనదారుడు దౌల్తాబాద్‌ మండలం చెల్లాపూర్‌కు చెందిన దాసరి రాజుగా గుర్తించామని తండా వాసులు తెలిపారు. దీనిపై తమకు ఫిర్యాదు అందలేదని ఆదివారం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్సై బాల వెంకటరమణ తెలిపారు. మృతుడికి భార్య హేమ్లీబాయి, ఇద్దరు కుమారుడు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement