స్వతంత్రుల సత్తా
● ప్రధాన పార్టీల అభ్యర్థులకు షాక్
● భారీగా ఖర్చుపెట్టిన వార్డుల్లో
ఇండిపెండెంట్ల గెలుపు
మొయినాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో భారీగా డబ్బులు ఖర్చుపెట్టిన ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులకు సైతం ఓటమి తప్పలేదు. ఐదు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థుల చేతుల్లో ఓటమి చవిచూశారు. సురంగల్ 13వ వార్డులో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులు భారీగా ఖర్చుపెట్టారు. ఈ వార్డులో వీరు ఖర్చు చేసిన మొత్తం సుమారు రూ.10 కోట్లకు పైనే ఉంటుందని తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి చివరి నిమిషంలో బీఫాం తీసుకుని పోటీ చేయగా, ముందు నుంచి టికెట్‌పై ఆశలు పెట్టుకున్న అభ్యర్థి గడ్డం లక్ష్మి వెంకట్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. మున్సిపల్ పరిధిలోనే అత్యధికంగా ఖర్చుపెట్టిన ఈ వార్డులో బీజేపీ అభ్యర్థి గుమ్మళ్ల శ్రావణిపై ఇండిపెండెంట్ గడ్డం లక్ష్మి 81 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇందులో బీఆర్‌ఎస్ అభ్యర్థి నిర్దుల అనిత మూడో స్థానంలో, కాంగ్రెస్ అభ్యర్థి యాలాల లావణ్య నాలుగో స్థానంలో నిలవడం గమనార్హం.
21, 22 వార్డుల్లోనూ..
చిలుకూరులోని 22వ వార్డులోనూ స్వతంత్ర అభ్యర్థి గరుగు రాజు విజయం సాధించారు. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థితోపాటు బీజేపీ అభ్యర్థి గున్నాల గోపాల్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి గున్నాల సుధాకర్‌రెడ్డి భారీగా డబ్బు వెచ్చించారు. అయినా ఓటర్లు స్వతంత్ర అభ్యర్థి వైపే మొగ్గు చూపారు. 21వ వార్డులోనూ ఓటర్లు ప్రధాన పార్టీల అభ్యర్థులను పక్కన పెట్టి ఇండిపెండెంట్ అభ్యర్థి గౌర అనసూయను గెలిపించారు. ఈ వార్డులో బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు పెద్ద మొత్తంలో ఖర్చు చేశారు. అయినప్పటికీ బీఆర్‌ఎస్ అభ్యర్థి సిద్దెంతి స్వప్నపై స్వతంత్ర అభ్యర్థి గౌర అనసూయ 136 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు.
11వ వార్డులో హోరాహోరీ
ఎనికేపల్లిలోని 11వ వార్డులో బీఆర్‌ఎస్ అభ్యర్థి అమ్డాపూర్ సునీల్, స్వతంత్ర అభ్యర్థి మద్యపాగు మహేశ్ మధ్య హోరాహోరీ పోరు సాగింది. బీఆర్‌ఎస్ అభ్యర్థిపై స్వతంత్ర అభ్యర్థి 22 ఓట్ల తేడాతో గెలుపొందారు. హిమాయత్‌నగర్‌లోని 3వ వార్డులో సైతం ఓటర్లు స్వతంత్ర అభ్యర్థికే పట్టం కట్టారు. అధికార కాంగ్రెస్ అభ్యర్థి పైలి రమాదేవిపై స్వతంత్ర అభ్యర్థి బిల్లపాటి కవిత 130 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
గడ్డం లక్ష్మి, 13వ వార్డు
బిల్లపాటి కవిత, 3వ వార్డు
మధ్యపాగ మహేష్, 11వ వార్డు
స్వతంత్రుల సత్తా
స్వతంత్రుల సత్తా
స్వతంత్రుల సత్తా
స్వతంత్రుల సత్తా
స్వతంత్రుల సత్తా
స్వతంత్రుల సత్తా


