అధిక మెజార్టీతో గెలిపించండి
తాండూరు టౌన్: మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటేసి తన కోడల్ని ఆశీర్వదించాలని పట్టణ మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ కొట్రిక విజయలక్ష్మి అన్నారు. సోమవారం ఆమె పట్టణంలోని 24వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలిశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈసారి ఎన్నికల్లో తన కోడలు కొట్రిక నాగలక్ష్మి పోటీలో ఉందన్నారు. గతంలో నన్ను ఆదరించి, గెలిపించి, మున్సిపల్ చైర్‌పర్సన్‌ని చేసినట్లుగానే తన కోడలిని గెలిపించాలన్నారు. బీఆర్‌ఎస్ హయాంలోనే వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సౌకర్యం మెరుగుపడిందన్నారు. అనంతరం కౌన్సిలర్ అభ్యర్థి నాగలక్ష్మి మాట్లాడుతూ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు.


