విధులు సమర్థవంతంగా నిర్వహించండి | - | Sakshi
Sakshi News home page

విధులు సమర్థవంతంగా నిర్వహించండి

Feb 3 2026 8:40 AM | Updated on Feb 3 2026 8:40 AM

విధులు సమర్థవంతంగా నిర్వహించండి

విధులు సమర్థవంతంగా నిర్వహించండి

మున్సిపల్‌ కమిషనర్‌ మధుసూదన్‌రెడ్డి

తాండూరు: ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించాలని మున్సిపల్‌ కమిషనర్‌ మధుసూదన్‌రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని ప్రభుత్వ నంబర్‌ 1 పాఠశాలలో పోలింగ్‌ అధికారులకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్టర్‌ ట్రైనర్‌లో పోలింగ్‌ నిర్వహణపై అవగాహన కల్పించి, మాట్లాడారు. ఈ నెల 11న జరిగే మున్సిపల్‌ ఎన్నికల గురించి అధికారులు పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా క్రతువు ముగించేలా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు శిక్షణకు వచ్చిన సిబ్బంది దరఖాస్తులు అందజేశారు. మున్సిపల్‌ మెనేజర్‌ నరేందర్‌రెడ్డి, టీఓటీలు ముసవ్వీర్‌, సంతోష్‌, బస్వరాజ్‌, వీరేశం, పోలింగ్‌ అధికారులు తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement