పంచాయతీ రికార్డులు సక్రమంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

పంచాయతీ రికార్డులు సక్రమంగా నిర్వహించాలి

Feb 14 2026 10:11 AM | Updated on Feb 14 2026 10:11 AM

పంచాయ

పంచాయతీ రికార్డులు సక్రమంగా నిర్వహించాలి

యాభైశాతం సబ్సిడీపై ఫ్రూట్‌ కవర్లు

డీఎల్‌పీఓ సంధ్యారాణి

మోమిన్‌పేట: పంచాయతీ రికార్డులు సక్రమంగా నిర్వహించాలని డీఎల్‌పీఓ సంధ్యారాణి అన్నారు. శుక్రవారం మండలంలోని ఎన్కతల గ్రామాన్ని ఆమె సందర్శించారు. జీపీ రికార్డులను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలన్నారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఇళ్ల నిర్మాణాలపై ఫిర్యాదులు వస్తే జిల్లా అధికారుల దృష్టికి తేవాలన్నారు. నర్సరీల్లో మొక్కల పెంపకం చేపట్టి వర్షాకాలం నాటికి సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్‌బీఎం కోఆర్డినేటర్‌ లక్ష్మి, కార్యదర్శి నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

ఫార్మా రంగంలో అపారమైన అవకాశాలు

తుర్కయంజాల్‌: ఫార్మా రంగంలో విద్యార్థులకు అపారమైన అవకాశాలు ఉన్నాయని ఉస్మానియా యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కుమార్‌ మొలుగారం అన్నారు. తుర్కయంజాల్‌లోని సెయింట్‌ పాల్స్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మసీలో అసోసియేషన్‌ ఆఫ్‌ ప్రొఫెషనల్స్‌ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఒక్కరోజు ఇండో–గల్ఫ్‌ అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఫార్మా విద్యార్థుల్లో పరిశోధన సామర్థ్యం పెరగాలని, కొత్త సాంకేతికతను అందిపుచ్చుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం రాఘవ రెడ్డి, సుధీర్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

ఆమనగల్లు: మామిడిలో సరైన మెలకువలు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి సురేశ్‌ అన్నారు. ఆకుతోటపల్లి రైతు వేదికలో శుక్రవారం రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఫ్రూట్‌ కవర్‌ వాడటం ద్వారా పండు ఈగ, వడగల్ల నుంచి కాయలను రక్షించుకోవచ్చన్నారు. ఎకరాకు 8వేల ఫ్రూట్‌ కవర్లను ప్రభుత్వం యాభై శాతం సబ్సిడీపై అందజేస్తోందని వివరించారు. కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీకృష్ణ, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి, స్థానిక ఉద్యానశాఖ అధికారి సౌమ్య, అధికారులు శశిధర్‌, ప్రభు, భూదేవి, శ్రవణ్‌, కిశోర్‌ తదితరులు పాల్గొన్నారు.

కుష్టు వ్యాధి నివారణకు ప్రత్యేక చొరవ

అబ్దుల్లాపూర్‌మెట్‌: కుష్టువ్యాధి నివారణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోందని, వ్యాధిగ్రస్తులు ఆందోళన చెందకుండా చికిత్సతో పాటు జాగ్రత్తలు తీసుకుంటే నయం అవుతుందని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ లలితాదేవి, డీఎల్‌ఓ డాక్టర్‌ పాపారావు అన్నారు. పెద్దఅంబర్‌పేటలోని శాంతినగర్‌ లెప్రసీ కాలనీలో శుక్రవారం నిర్వహించిన కుష్టువ్యాధి నివారణ పక్షోత్సవాల ముగింపు కార్యక్రమానికి వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా వ్యాధి గ్రస్తులకు సూచనలు, సలహాలు ఇవ్వడంతో పాటు వారికి కావాల్సిన ఎంసీఆర్‌ చెప్పులు, సెల్ఫ్‌ కేర్‌ కిట్స్‌ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ష్లాప్‌ అధ్యక్షుడు రమేష్‌, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ లక్ష్మీ ప్రసన్న, ఎంఓ డాక్టర్‌ ప్రియాంక, పీఎంఓ సులోచన, సీహెచ్‌ఓ లక్ష్మీనారాయణ, డీపీఎంఓ శాంతిరాజు తదితరులు పాల్గొన్నారు.

పంచాయతీ రికార్డులు  సక్రమంగా నిర్వహించాలి 
1
1/2

పంచాయతీ రికార్డులు సక్రమంగా నిర్వహించాలి

పంచాయతీ రికార్డులు  సక్రమంగా నిర్వహించాలి 
2
2/2

పంచాయతీ రికార్డులు సక్రమంగా నిర్వహించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement