కొత్తవారికే పట్టణం
నాడు ఓటమి.. నేడు గెలుపు
తాండూరు: కొత్త వారికి ప్రజా ప్రతినిధులుగా అవకాశం కల్పించడంలో తాండూరు ప్రఖ్యాతి గాంచింది. ఎన్నికలు ఏవైనా కొత్తవారికే అవకాశం ఇస్తామనే తీర్పు తాండూరు మరోసారి తేటతెల్లమైంది. మున్సిపల్ పరిధిలో 36 వార్డులకు 135 మంది బరిలో నిలిచారు. హోరా హోరిగా జరిగిన పోరులో 32 మంది కొత్త కౌన్సిలర్లు సోమవారం కౌన్సిల్ హాల్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన 19 మందిలో 16 మంది, బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన 12 మందిలో 11 మంది తొలిసారి గెలిచినవారే. మూడవసారి విజయం సాధించిన 12వ వార్డు కౌన్సిలర్ నీరజాబాల్‌రెడ్డికి చైర్‌పర్సన్‌గా, అబ్దుల్ రజాక్‌కు వైస్‌చైర్మన్‌గా అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. బీజేపీ నుంచి గెలిచిన ముగ్గురు కౌన్సిలర్లలో ఇద్దరు తల్లిదండ్రుల వారసత్వాన్ని అందిపుచ్చుకుని కౌన్సిలర్‌లుగా గెలిచారు. ఎంఐఎం నుంచి ఒకరు, ఇండిపెండెంట్ కౌన్సిలర్ మరొకరు ఉదయం 11గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికలలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీల నుంచి పోటీ చేసిన అభ్యర్థులు ఏడుగురు ఓటమి చవిచూశారు. 6వ వార్డు అభ్యర్థి అనిల్‌అర్మి, 7వ వార్డు నుంచి ఇర్షద్, 11వ వార్డు నుంచి బంటు వేణుగోపాల్, 16వ వార్డు నుంచి నారాశ్రీలత, 19వ వార్డు నుంచి జుంటిపల్లి వెంకట్, 20వ వార్డు నుంచి నవీన, 31వ వార్డు నుంచి మెగానంద్ తాజా ఎన్నికల్లో భారీ మెజార్టీలతో విజయం సాధించారు.
తాండూరు కౌన్సిల్‌లోకి 32 మంది నూతన కౌన్సిలర్లు


