బీజేపీకి సుదర్శన్‌గౌడ్‌ రాజీనామా | - | Sakshi
Sakshi News home page

బీజేపీకి సుదర్శన్‌గౌడ్‌ రాజీనామా

Feb 6 2026 7:17 AM | Updated on Feb 6 2026 7:17 AM

బీజేపీకి సుదర్శన్‌గౌడ్‌ రాజీనామా

బీజేపీకి సుదర్శన్‌గౌడ్‌ రాజీనామా

తాండూరు టౌన్‌: భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గోరేపల్లి సుదర్శన్‌ గౌడ్‌ ప్రకటించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ తరఫున 28వ వార్డు నుంచి పోటీ చేసి తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోన తన భార్యకు ఈసారి టికెట్‌ కేటాయించకపోవడం చాలా బాధాకరమన్నారు. ఏళ్ల తరబడిగా పార్టీ జెండా మోస్తున్న మా కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం సమంజసం కాదన్నారు. ఈసారి 28వ వార్డులో పార్టీ పట్టణాధ్యక్షుడు నాగారం మల్లేశంకు టికెట్‌ ఇవ్వడాన్ని తప్పుబడుతున్నట్లు చెప్పారు. ఆయన ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కొత్తపల్లి గ్రామంలో ఓటు వేశారన్నారు. అక్కడ ఓటేసి ఇక్కడ పోటీ చేయడం సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించినట్లేనన్నారు. ఆయన గెలిచినప్పటికీ ఆరు మాసాల్లో పదవి పోతుందన్నారు. తాండూరు, జిల్లా నాయకుల తీరు పట్ల అసహనంతో రాజీనామా చేసినట్లు చెప్పారు. ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి దృష్టికి తన విషయాన్ని తీసుకెళ్తే తనకు సంబంధం లేనట్లు మాట్లాడటం విడ్డూరమన్నారు. అందుకే రాజీనామా చేశానట్లు చెప్పారు. తాండూరు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు తనను ఫోన్‌లో సంప్రదించి సానుభూతి వ్యక్తం చేశారన్నారు. తాను ఏ పార్టీలో చేరే విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తానన్నారు.

జిల్లా నాయకులపై తీవ్ర ఆరోపణలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement