చెక్‌డ్యాం పనుల్లో వేగం పెంచండి
యాలాల: మండలంలోని సంగెంకుర్దు శివారులో కాగ్నా నదిపై చేపడుతున్న చెక్ డ్యాం పనుల్లో వేగం పెంచాలని ఇరిగేషన్ సీఈ(చీఫ్ ఇంజినీర్) సత్యనారాయణరెడ్డి ఆదేశించారు. బుధవారం ఎస్‌ఈ రవికుమార్, ఈఈ అశోక్‌కుమార్, డీఈ స్వామి, ఏఈఈ భానుప్రసాద్ తదితరులతో కలిసి పనులను పరిశీలించారు. కాంట్రాక్టర్ పనులను నిలిపివేయడంతో కొత్తగా వారికి అప్పగిస్తామని తెలిపారు. రూ.7 కోట్లతో నిర్మిస్తున్న చెక్‌డ్యాం 3.2 ఎత్తు, 280 మీటర్ల పొడువుతో నిర్మిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఇరిగేషన్ వర్క్ ఇన్‌స్పెక్టర్ వెంకటేష్, సైట్ ఇంజినీర్ రవీందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
ఇరిగేషన్ సీఈ సత్యనారాయణరెడ్డి


