మెజార్టీ మున్సిపాలిటీల్లో గెలుస్తాం
● ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
● బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం
తాండూరు: చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని మెజార్టీ మున్సిపాలిటీల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధిస్తారని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. గురువారం తాండూరు మున్సిపల్ పరిధిలోని 24, 25, 27, 33, 34వ వార్డుల్లో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు యూ రమేష్‌కుమార్‌తో కలిసి అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వికారాబాద్ జిల్లాలో ప్రజల మద్దతు బీజేపీకే ఉందన్నారు. కార్యక్రమంలో 24వ వార్డు అభ్యర్థి సాహు శ్రీలత, పార్టీ స్థానిక సంస్థల జిల్లా కన్వీనర్ బాలేశ్వర్‌గుప్తా, నాయకులు సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


