కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్ అభ్యర్థి
అనంతగిరి: వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 17వ వార్డులో బీఆర్‌ఎస్ తరఫున బరిలో ఉన్న టి.ఆనంద్‌కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బుధవారం రాత్రి పార్టీ రాష్ట్ర నాయకుడు మహిపాల్‌రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆనంద్‌కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం అనన్యకు సంపూర్ణ మద్దతుగా అధికార పార్టీలో చేరడం జరిగిందన్నారు. అనంతరం మర్యాదపూర్వకంగా స్పీకర్ ప్రసాద్‌కుమార్‌ను కలిశారు. కార్యక్రమంలో నాయకులు నరోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


