సీఎం సభకు ముమ్మర ఏర్పాట్లు
పరిగి: మండలంలో ఈ నెల 7న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను గురువారం ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, కలెక్టర్ ప్రతీక్‌జైన్, ఎస్పీ స్నేహమెహ్ర పరిశీలించారు. నారాయణపూర్ సమీయపంలో సీఎం బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 40వేల మంది వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వెయ్యి మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతీక్‌జైన్ మాట్లాడుతూ.. సీఎం పర్యటన నేపథ్యంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు. అవసరమైన అన్ని ఏర్పాట్లను వెంటనే పూర్తి చేయాలన్నారు. హెలిప్యాడ్, వేదిక వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. వాహనాల పార్కింగ్ కోసం స్థలాలు కేటాయించాలన్నారు. ఎస్పీ స్నేహమెహ్ర మాట్లాడుతూ.. సీఎం పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం పర్యటన నేపథ్యంలో ఈ ప్రాంత సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సై మోహనకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
‘రేడియల్’ సర్వే పకడ్బందీగా జరగాలి
దోమ: రేడియల్ రహదారి నిర్మాణం కోసం పకడ్బందీగా సర్వే నిర్వహించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. గురువారం దోమ తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పురాతన రికార్డులను భద్ర పరచాలని సూచించారు. పెండింగ్ ఫైళ్లను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలన్నారు. రేడియల్ రోడ్డుకు రైతులు అభ్యంతరం తెలిపితే తమ దృష్టికి తేవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజేశ్వరి, ఆర్‌డీఓ వాసుచంద్ర, తహసీల్దార్ గోవిందమ్మ, డీటీ నర్సింహులు, సీనియర్ అసిస్టెంట్ పర్వేజ్, ఆర్‌ఐలు రాంజేంద్రర్‌రావ్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
సభాస్థలిని పరిశీలించిన ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీ


