మెరుగైన వైద్యం మన బాధ్యత | - | Sakshi
Sakshi News home page

మెరుగైన వైద్యం మన బాధ్యత

Feb 6 2026 11:47 AM | Updated on Feb 6 2026 11:47 AM

మెరుగైన వైద్యం మన బాధ్యత

మెరుగైన వైద్యం మన బాధ్యత

మెరుగైన వైద్యం మన బాధ్యత

ధారూరు: ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యం అందించడం మన బాధ్యత అని డీఎంహెచ్‌ఓ స్వర్ణకుమారి అన్నారు. గురువారం మండలంలోని నాగసమందర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులు, మందులు, ఆస్పత్రి పరిసరాలను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. చిత్తశుద్ధితో పనిచేసి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఆస్పత్రికి వచ్చే వారిని ఆప్యాయంగా పలకరించాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ల్యాబ్‌ టెక్నిషియన్‌ ప్రీతమ్‌, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.

పీహెచ్‌సీల సందర్శన

బంట్వారం: ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని డీఎంహెచ్‌ఓ స్వర్ణకుమారి అన్నారు. గురువారం బంట్వారం, కోట్‌పల్లి పీహెచ్‌సీలను సందర్శించారు. వైద్యులు మజీద్‌ఖాన్‌, మేఘనతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. రక్త నమూనాల సేకరణ, రిపోర్టుల అందజేతపై ఆరా తీశారు. పీహెచ్‌సీల్లో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని చెప్పారు. అనంతరం బార్వాద్‌ సబ్‌ సెంటర్‌ను, కరీంపూర్‌ పీహెచ్‌సీని తనిఖీ చేశారు.

డీఎంహెచ్‌ఓ స్వర్ణకుమారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement