26న శ్రీవారి బాలాలయ ప్రతిష్ఠాపన
కొడంగల్: కొడంగల్‌లోని పద్మావతీ సమేత శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 26న శ్రీవారి బాలాలయ ప్రతిష్ఠాపన మహోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్తలు బుధవారం తెలిపారు. ఉదయం 9.10 నుంచి 10.20 నిమిషాలలోపు కార్యక్రమం జరుగుతుందన్నారు. వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని విస్తరించి అభివృద్ధి చేయనున్నారు. ఇందులో భాగంగా ఆలయం చుట్టూ ఉన్న నిర్మాణాలను తొలగిస్తున్నారు.నిత్య పూజలు, కై ంకర్యాలు నిర్వహించడం కోసం శ్రీవారి బాలాలయాన్ని నిర్మిస్తున్నారు. నాలుగు రోజలు పాటు ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి. 23న ఆచార్య వచనం, మత్స సంగ్రహనం, అంకురార్పణ, 24న పుణ్యహ వచనం, వాస్తు హోమం, యాగశాల శుద్ధి, అగ్ని ప్రతిష్ఠ, కలశ ప్రతిష్ఠ, బాలాలయ శుద్ధి, 25న హోమాలు, అభిషేకం, నవ చతుర్ధశ కలష స్నపనం, మహాశాంతి, 26 పుణ్యవచనం, ఉక్త హోమాలు, మహా పుర్ణాహుతి, బాలాలయ ప్రవేశం, ప్రతిష్ఠాపన కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఇందుకు సంబంధించిన నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆలయ ధర్మకర్తలు, అర్చకులు కోరారు.


